రాహుల్ సిప్లిగంజ్ దాడి వెనుక కారణం అదేనా?

57

బిగ్ బాస్ 3 విజేత, గాయకుడు, నటుడు రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. పబ్బులో జరిగిన గొడవలో కొందరు వ్యక్తుల తలపై బీరు సీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు బుధవారం రాత్రి 11.45 గంటల సమయంలో వచ్చారు. అక్కడే ఉన్న కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో రాహుల్ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అప్పటికి గొడవ సర్దుమణిగినప్పటికీ అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కొందరు యువకులు రాహుల్ ను బీరు సీసాలతో తలపై కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. రాహుల్ పై పథకం ప్రకారమే దాడి జరిగిందా ? దీనికి పాత కక్షలే కారణమా అంటే ఔననే అంటున్నారు రాహుల్ ఫ్రెండ్స్. ఈయన తరుచుగా గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌ కు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ రాహుల్‌ కు అప్పట్లో అక్కడున్న కొంత మందితో కొంత కాలం క్రితం గొడవ జరిగిటనట్టు సమాచారం. అప్పట్లో ఆ గొడవ సద్దుమణిగింది. అయితే.. గొడవ పడ్డవాళ్లు సమయం కోసం వేచి చూచారు. అప్పుడే పునర్నవితో కలిసి పబ్ కు వచ్చాడు. ఇదే అదనుగా భావించిన వాళ్లు పునర్నవిని టీజ్ చేసారు. తన అయినా పున్నును టీజ్ చెయ్యడంతో కోపం వచ్చిన రాహుల్ వాళ్లను మందలించాడు. దీంతో మాటా మాటా పెరిగి అది కాస్తా రాహుల్‌ను బీర్ బాటిల్‌తో కొట్టే వరకు వెళ్లింది.

ఈ క్రింది వీడియో చూడండి

రాహుల్ పై దాడి జరగడంతో వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగినప్పుడు రాహుల్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరనేది తెలియలేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో అసలు ఫేవరేట్ ఏమాత్రం కాని రాహుల్ ఫైనల్ గా టైటిల్ విన్నర్ అయ్యాడు. పునర్నవితో లవ్వు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం రాహుల్ కు కలిసొచ్చింది. బిగ్ బాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రాహుల్ భారీ ప్లాన్ లే వేశాడు. ఇన్నాళ్ళు సింగర్ గానే అలరించిన రాహుల్ ఇక మీదట నటుడిగా కూడా కనిపించనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో రాహుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రంగమార్తాండ’. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ‘నటసామ్రాట్’ మరాఠీలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీన్ని తెలుగులో తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రాహుల్ కు మంచి పాత్ర పడ్డదట. కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న రాహుల్ అనవసరమైన గొడవల్లో చిక్కుకోవడం దురదృష్టమని చెప్పొచ్చు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation