నాగార్జున నన్ను మోసం చేశారు.. హీరోయిన్ రేఖ సంచలన వ్యాఖ్యలు..

114

శ్రీను వైట్ల డైరక్షన్ లో ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఆనందం సినిమా అప్పట్లో యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. 2001లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది కన్నడ భామ రేఖ వేదవ్యాస్. అప్పటికే ఒక కన్నడ సినిమా మాత్రమే చేసిన అనుభవం ఉన్న రేఖా ఆనందం సినిమాలో చాలా బాగా నటించింది. ఆ తర్వాత నందమూరి తారకరత్న హీరోగా డెబ్యూ మూవీ ఒకటో నంబర్ కుర్రాడు సినిమాలో ఆమె లక్కీ ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆ మూవీలోని పాటలు ఇప్పటికి సూపర్ హిట్ అనిపిస్తాయి. ఆ సినిమా హిట్ అయితే రేఖ కెరియర్ ఇంకాస్త జోష్ గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున మీద సంచలన కామెంట్స్ చేసింది. నాగార్జున నన్ను మోసం చేశాడు అని చెప్తుంది.. మరి ఏ విషయంలో మోసం చేశాడో చూద్దామా.

ఈ క్రింది వీడియోని చూడండి

లేటెస్ట్ గా ఆలీతో సరదాగా టాక్ షో కు వచ్చిన రేఖ పలు విషయాలను పంచుకుంది.. ఏమైంది..ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే ముంబైలో సెటిల్ అయ్యాను. అక్కడే మూవీస్ లలో నటిస్తున్నా. అప్పుడప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ..ఇలా అన్ని ఇండస్ట్రీలలో తిరుగుతున్నా అని చెప్పింది. నేను ఇండియన్ కాబట్టి అన్ని కవర్ చేస్తున్నా అని సరదాగా చెప్పింది. ఇక ఒకవేళ నువ్వు సీఎం అయితే యూత్ ను ఏమి ఇస్తావు అనే ప్రశ్నకు, ఏ పార్క్ లో అయినా ఎప్పుడైనా ఫ్రీగా తిరగొచ్చు. ఆ పర్మిషన్ యూత్ అందరికి ఇస్తా అని వెరైటీ సమాధానం చెప్పింది. ఇదే సమయంలో నాగార్జున నన్ను మోసం చేశాడు అని చెప్పుకొచ్చింది. కింగ్ నాగార్జున, విజయభాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మన్మథుడు సినిమాలో రేఖకు ఓ స్పెషల్ అప్పియరెన్స్ ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా చేసే టైం లో నాగార్జున తనకు మరో సినిమా అవకాశం ఇస్తా అని అన్నారట. కాని ఇప్పటివరకు ఆ కాల్ రాలేదని చెప్తూ బాధపడుతుంది. నాగార్జున సర్ మీరు నాకు ఛాన్స్ ఇచ్చి మాట నిలబెట్టుకోండి అని కోరుతుంది.

Image result for rekha vedavyas

ఇక పెళ్లి గురించి చెప్తూ..నాకు ఇంకా ఎవరు నచ్చలేదు. చాలామంది కర్చీఫ్ వేశారు కానీ నాకు ఎవరి కర్చీఫ్ నచ్చలేదు. అందుకే ఇంకా నేను సింగిల్ గా ఉన్నా. ఏరోజైనా మంచి ఖర్చిఫ్ వస్తాదా అని ఎదురుచూస్తున్నా అని కొంటె సమాధానం చెప్పింది. ఇక కొందరు అయితే బ్లడ్ తో నాకు లవ్ లెటర్ రాశారు. కానీ అది ఎవరు రాశారో ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నా. అతను ఎవరో ఇప్పుడైనా నా ముందుకు రండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తా అని సరదాగా చెప్పింది. ఇక బ్రతికున్న తనని మీడియా చంపేసిందన్న వార్తల పట్ల కూడా స్పందించింది రేఖ. ఎవరికీ దక్కుతుంది చెప్పండి ఆ అదృష్టం. నేను బతికుండగానే, చనిపోయిన సన్నివేశాలను చూశాను. నేను చనిపోయాకా పరిస్థితులు ఎలా ఉంటాయో నేను బతికుండగానే చూశాను అని మీడియా రాసే తప్పుడు వార్తలకు తనదైన స్టైల్ లో స్పందించింది. ఇక తన కెరియర్ లో జరిగిన విషయాల పట్ల చాలా క్లియర్ కట్ గా చెప్పింది. . కొన్నాళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరమైన ఈ అమ్మడు కన్నడలో మాత్రం సినిమలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. మళ్ళి తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అని చెప్పింది. ఇంకా రేఖ ఎలాంటి విషయాలు చెప్పిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation