వంద ఎకరాల భూమిని కొన్న యాంకర్ రష్మీ ?

161

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10 లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా రాణిస్తుంది. గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. యాంకర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ రష్మీకి ఉంది. ఆమె కోసం షో చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి 2001 లోనే వచ్చిన రష్మీకి గుర్తింపు రావడానికి చాలా సమయమే పట్టింది. అవకాశాలు రాకా చిన్న చిన్న పాత్రలు చేసింది. ఒకానొక దశలో అవకాశాలు రాకా ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది. అలంటి సమయంలో జబర్దస్త్ పోగ్రామ్ ఛాన్స్ రావడం, ఒక్కసారిగా రష్మీ జీవితం మారిపోవడం జరిగింది. జబర్దస్త్ పోగ్రామ్ తర్వాత రష్మీ ఏ రేంజ్ లో తన ఫాలోయింగ్ పెంచుకుందో మనకు తెలుసు.

ఈ క్రింది వీడియో చుడండి

ఇక అసలు విషయానికి వస్తే.. సాధారణంగా సినిమాకు సంబంధించిన వారు తాము సంపాదించుకున్న డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టాలని చూస్తుంటారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అపార్ట్‌మెంట్స్ కొనుక్కున్నారు. అలాగే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సొంతంగా బిజినెస్ ఉండాలని హోటల్ బిజినెస్ మొదలుపెట్టారు. అలాగే మహేష్ బాబు థియేటర్ ను ఓపెన్ చేశాడు. మరో పక్క హీరోయిన్లలో రకుల్ జిమ్ సెంటర్స్ నడుపుతున్నారు. ఇలా టాలీవుడ్ లో ఒక్కొక్క సెలెబ్రిటీ ఒక్కొక్క బిజినెస్ చేస్తూ, ఇటు సినిమాల నుంచి, బయట బిజినెస్ ల నుంచి బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకే రష్మీ కూడా వచ్చింది. రష్మి భూములు కొన్నారట. భూమి అంటే ఒకటో రెండో ఎకరాలు కొనలేదు. దాదాపు వంద ఎకరాల భూములు కొన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

Image result for rashmi

ఆంధ్రా- ఒడిశా బోర్డర్ దగ్గర ఉన్న బెర్హాపూర్ ప్రాంతంలో రష్మి పుట్టారు. అయితే చిన్నప్పుడే రష్మీ ఫామిలీ వైజాగ్ రావడంతో ఆమె చదువంతా వైజాగ్‌ లో జరిగింది. అందుకే రష్మికి తెలుగు భాషలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆమె చుట్టాలందరు కూడా బెర్హాపూర్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. అందుకే అక్కడే రష్మీ భూమిని కొన్నదంట. అయితే ఆమె కొన్న వంద ఎకారల భూమిలో కోకో, యూకలిప్టస్ పంటలను వేయబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఫార్మింగ్ చేసి తనకంటూ ఒక బిజినెస్ ఉండాలని అనుకుంటుందట. అయితే రష్మీ భూమి కొన్నదనే విషయం నిజమా లేక రూమరా అనే విషయం తెలియాల్సి ఉంది. తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ కు సంబంధించిన విషయాలపై ఎలాంటి రూమర్స్ వచ్చినా రష్మి వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. మరి ఈ వంద ఎకరాల భూమి కొన్నట్లు వస్తున్న వార్తలపై రష్మి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation