RRR…. చరణ్, ఆలియా గెటప్స్ లీక్.. చూడటానికి రెండు కళ్లు చాలవంతే

148

ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ ..ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. కొమురం బీమ్‌గా ఎన్టీఆర్‌.. అల్లూరి పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి కూడా తెలిసిందే. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న ప‌ది భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది.

బాహుబ‌లి’ త‌ర్వాత రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. అయితే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్, సీతా మహాలక్ష్మి గెటప్‌లో ఆలియా భట్ ఫొటోలు బయటికి వచ్చాయి.

ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. బ్రిటీష్ సైనికాధికారి పాత్ర‌లో చ‌ర‌ణ్‌, పాత‌కాలం చీర‌క‌ట్టులో ఆలియాభ‌ట్ క‌న‌ప‌డుతున్నారు. మ‌రి ఈ ఫొటోలు లీకుల ప‌ర్వంలో భాగంగా ఏమైనా లీక‌య్యాయా? లేక ఎవరైనా ఫ్యాన్స్ త‌యారు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారా? అని చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు

సీతారామరాజు, సీతా మహాలక్ష్మిగా రామ్ చరణ్, ఆలియా భట్ ఇలాగే కనిపించబోతున్నారా అనే అనుమానం చాలా మందికి క‌లుగుతోంది… తాజాగా ఫొటో బయటికి వచ్చింది. బ్రిటిష్ పోలీస్ డ్రెస్‌లో చరణ్, ఆయన సతీమణి సీత పాత్రలో ఆలియా పాతకాలం నాటి ఫొటోగా దీనిని డిజైన్ చేసారు కొంద‌రు దీనిని మార్ఫ్ పిక్ అని అంటున్నారు.

RRR’కు సంబంధించి ఇప్పటికే 80శాతం షూటింగ్ అయిపోయిందని అంటున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే. ఎటూ సినిమాను 2021కి వాయిదా వేసారు కాబట్టి కనీసం చరణ్ బర్త్‌డే రోజున అయినా రాజమౌళి ఏదన్నా సర్‌ప్రైజ్ ఇస్తారేమో చూడాలి. న్యూఇయర్, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం రోజున సినిమా నుంచి ఎలాంటి సర్‌ప్రైజెస్ రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తారట. పులితో ఫైట్ అంటే ‘మన్యం పులి’లో మాదిరిగా గ్రాఫిక్స్ కాదట.. నిజం పులితోనే ఎన్టీఆర్ ఫైట్ చేస్తారని అంటున్నారు. దీనికోసం ఇప్పటికే ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నారని అంటున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ సారథ్యంలో నిజం పులితో ఎలా ఫైట్ చేయాలో ఎన్టీఆర్ నేర్చుకున్నారట. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఇలా నిజం పులితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నారని అంటున్నారు.

ఇదిలా ఉండగా గతంలో తారక్ పాత్రకు సంబంధించిన గెటప్ ఒకటి లీకైంది. చెడ్డీ వేసుకుని ఉన్న తారక్ లుక్ ఒకటి వైరల్ అయింది. దాంతో RRRలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసినట్లైంది. ఈ సినిమాలో తారక్ వివిధ గెటప్స్‌లో కనిపిస్తారని నటుడు ఛత్రపతి శేఖర్ ఓ సందర్భంలో వెల్లడించారు. దాంతో ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇకపోతే సినిమా ఎంత నేచురల్‌గా వస్తే అంతబాగా జనాలు కనెక్ట్ అవుతారనేది రాజమౌళి ప్లాన్. అందుకే సెట్స్‌ను కూడా చాలా సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. రామోజీ ఫిలిం సిటీలో ఓ అడవిలో ఇళ్లను క్రియేట్ చేసారు. వాటిని చూస్తే అచ్చం పల్లెటూర్లలా ఉన్నాయి. మరికొన్ని సెట్స్‌ను వికారాబాద్ అటవీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసారు.

సాధారణంగా రాజమౌళి ముందు ప్రకటించిన తేదీన సినిమా రిలీజ్ చేయరు అన్న టాక్ ఉండేది. అది ‘RRR’లోనూ నిజమైంది. ముందు జులై 30న సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి చాలా సమయం పడుతుందని చెప్పి 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Content above bottom navigation