జయహో కొమరం భీమ్ .. డూప్ లేకుండా పులితో ఫైట్ చేస్తున్న ఎన్టీఆర్..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా #RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి లాంటి ఇంటర్నేషన్ సినిమా తీసిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆయన ప్రెస్టీజ్ ఎక్కడ పోకూడదనే ఉద్దేశంతో చాల జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హీరోలుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను dvv దానయ్య నిర్మిస్తున్నాడు. అలియాభట్, ఒలివియా మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ డివివి బ్యానర్ ప్రకటించేసింది. అలాగే ఈ సినిమాను 2021 లో జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది.

Image result for rrr ntr

ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే ముఖ్యంగా ఈ సినిమాలోని కీలక యాక్షన్ సీన్స్ లో ఒకటైన పులి ఫైట్ ని ఈ షెడ్యూల్ లోనే తీయనున్నారట. కొమరంభీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ ఈ ఫైట్ సీన్ లో పులితో భీకర యుద్ధం చేస్తారట. అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ఈ ఫైట్ సన్నివేశాన్ని ఆడియన్స్ ఏ మాత్రం డూప్ గా ఫీల్ అవ్వకూడదు అని భావించి రాజమౌళి, నిజమైన పులితో ఫైట్ ని తీయాలని నిర్ణయించారట. అంతేకాక ఫైట్ లోని కొన్ని డేంజర్ సన్నివేశాల్లో మాత్రం హీరో ఎన్టీఆర్ కి బదులు డూప్ ని పెట్టాలని నిర్ణయించారట. అయితే అందుకు ఏ మాత్రం ఒప్పుకొని ఎన్టీఆర్, టోటల్ ఫైట్ మొత్తం కూడా నిజమైన పులితో తానే పోరాడుతానని చెప్పడంతో మొదట యునిట్ షాక్ తిన్నారట.

ఈ క్రింది వీడియోని చూడండి

అయితే ఆ తరువాత పలువురు శిక్షకుల సారథ్యంలో ఆ భీకర పోరాటాన్ని మొత్తానికి RRR టీమ్ చిత్రీకరించిందట. ఇక ఈ సీన్ తరువాత ఎన్టీఆర్ పై RRR టీమ్ ప్రశంశలు కురిపించినట్లు సమాచారం. నేటి హీరోల్లో ఎక్కువమంది కొన్ని క్రిటికల్ సీన్స్ లో తమకు ఏదైనా జరుగుతుందని భావించి డూప్స్ ని తప్పనిసరిగా పెట్టుకుంటారని, అయితే ఎన్టీఆర్ ఏకంగా నిజమైన పులితో డూప్ లేకుండా పోరుకి సిద్దమై, నటించడానికి ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అని వారు అంటున్నారట. కాగా ఈ వార్త నిన్నటి నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మా హీరో నిజమైన హీరో అని కొనియాడుతున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation