Breaking News:ఇండస్ట్రీలో మరో విషాదం..

గ‌త కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీ లో వరుస మరణ వార్తలు ప్రేక్షకులను , అభిమానులను కలవరపెడుతున్నాయి. రీసెంట్ గా దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ, హీరో శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు , నటుడు ఉదయ్ , కన్నడ నటి కిషోరి బల్లాళ్‌ మరణ వార్తలు ఇంకా మరచిపోకముందే శనివారం మరో మరణం చోటు చేసుకుంది.

Image result for దర్శకుడు శ్రీవాస్.

లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శ్రీవాస్. ఈయన ఇంట ఇప్పుడు అనుకోని విషాదం జరిగింది. ఆయన మాతృమూర్తి అమ్మాజీ ఫిబ్రవరి 22న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె పరిస్థితి విషమించి మరణించారు. ఆమె వయసు 68 సంవత్సరాలు. ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆమె చనిపోయినట్లు తెలుస్తుంది..

ఈ క్రింది వీడియో చూడండి

శ్రీవాస్‌తో పాటు ఈ దంపతులకు మరో ఇద్దరు సంతానం ఉన్నారు. ఆమె అంత్యక్రియలు తూర్పుగోదావరి జిల్లాలోని పురుషోత్తమపట్నంలో జరగనున్నాయి. ప్రస్తుతం నిర్మాత డివివి దానయ్య కుమారుడు డివివి కళ్యాణ్‌‌ను హీరోగా పరిచయం చేయబోయే సినిమాకు శ్రీవాస్ దర్శకుడు. ఈయనకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.గోపీచంద్‌ హీరోగా నటించిన లక్ష్యం సినిమాతో శ్రీవాస్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్‌, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు. నందమూరి బాలకృష్ణకు డిక్టేటర్ మూవీతో హిట్ ఇచ్చారు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా సాక్ష్యం.. ఆయ‌న త‌ల్లిగారి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని మ‌నం కూడా కోరుకుందాం.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation