నేను గంగూలీతో అందుకే విడిపోయా.. సంచలన విషయాలు బయటపెట్టిన నగ్మా..

హిందీ, తెలుగు, త‌మిళ సినిమా రంగాల‌కు చెందిన అగ్ర‌హీరోలంద‌రితోనూ న‌టించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది న‌గ్మా. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన న‌గ్మా ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి బిజీ అయిపోయింది. 44 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదు. గ‌తంలో టీమిండియా ఆట‌గాడు సౌర‌వ్ గంగూలీ, న‌గ్మా ప్రేమించుకున్నార‌నే సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే వివాహ‌మై ఒక కూతురు కూడా ఉన్న‌ప్ప‌టికీ న‌గ్మాతో పెళ్లికి సిద్ధ‌ప‌డ్డాడు గంగూలీ. ఇద్ద‌రూ జంట‌గా శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో పూజ‌లు కూడా చేశారు. అయితే చివ‌రి నిమిషంలో ఆ పెళ్లి ఆగ‌పోయింది. గంగూలీకి దూర‌మైన త‌ర్వాత కూడా న‌గ్మా మ‌రో పెళ్లి చేసుకోలేదు. అయితే ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఇప్పటికి కూడా చాలామందికి తెలీదు. అయితే ఈ విషయం మీద నగ్మా మొదటిసారి స్పందించింది. ఆమె గంగూలీతో జరిపిన ప్రేమ కహాని గురించి మీడియాతో మాట్లాడింది.

Image result for nagma ganguli

గంగూలీతో ప్రేమాయణం నిజమే. అతనికి పెళ్లై పిల్లలు ఉన్నారని తెలిసినా అతని ప్రేమలో పడ్డాను. ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. పెళ్లి చేసుకోవాలి అనుకున్న టైమ్ లో ఎవరి దారి వారు చూసుకున్నాం. నా వల్ల తన కెరీర్‌, అతని వల్ల నా భవిష్యత్ కు నష్టం కాకూడదనే తప్పుకున్నాం. ఇద్దరి కెరీర్స్ దెబ్బతిన కూడదనే ఉద్దేశం తోనే విడిపోయాం. ఆ సమయంలో అంతకు మించిన బాధ్యతలు నాకు చాలానే ఉన్నాయి. నా వెనుక నా కుటుంబం ఉంది. కుటుంబం కోసం, సమాజం కోసం ఇద్దరం విడిపోయాం అని చెప్పారు నగ్మా. అయితే మరి జీవితాంతం ఇలాగె ఉండిపోతారా అని అడిగితే..అలాంటిదేమి లేదు. నాకు నచ్చినవాడు దొరికితే తప్పకుండ పెళ్లి చేసుకుంటా అని చెప్పింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ప్రస్తుతం నగ్మా సినిమాలకు దూరంగా ఉంటున్నా రాజకీయాల్లో చేరి ప్రజలకు చేరువగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ లో యాక్టివ్‌ గా ఉండే నగ్మా, చాలా సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల సీనియర్‌ హీరోయిన్లు వరుసగా రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో నగ్మా రీ ఎంట్రీ పై కూడా చాలా వార్తలు వినిపించాయి. అయితే నగ్మా మాత్రం ఇంత వరకు రీ ఎంట్రీ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తెలుగులో 2002లో రిలీజ్‌ అయిన నిను చూడక నేనుండలేను నగ్మా చేసిన చివరి సినిమా, తరువాత బోజ్‌పూరి సినిమాలు ఎక్కువగా చేసిన నగ్మా, 2009 తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఆమె మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation