టాలీవుడ్ లో విషాదం.. 1000 సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి.. తరలివస్తున్న నటులు

241

తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు అలుముకొన్నాయి. గొల్లపూడి మారుతిరావుతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా గత రెండు మూడు నెలల్లో కన్నుమూసారు. ఇప్పుడు మరో సీనియర్ నటుడు కూడా తుదిశ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందిస్తున్న సీనియర్ నటుడు జనార్ధనరావు ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం చెన్నైలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. జనార్ధనరావు మృతికి మా అసోసియేషన్‌తో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జనార్ధనరావు సినీ జీవితం గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

తెలుగులో 1000కి పైగా సినిమాల్లో కనిపించిన సీనియర్ ఆర్టిస్ట్ జనార్ధన రావు అనారోగ్యంతో మరణించారు. మార్చ్ 6 ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు జనార్ధన రావు. గుంటూరు జిల్లా పొనిగ‌ళ్ల గ్రామంలో జ‌న్మించిన జ‌నార్ధ‌న్ రావు చిన్న చిన్న వేషాలతో ప్రతిభను నిరూపించుకొంటూ నటుడిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణ లాంటి దిగ్గజ తరంతోనే కాకుండా నేటి తరం యువ హీరోల చిత్రాల్లో కూడా నటించారు. వెయ్యికి పైగా తెలుగు చిత్రాలు, ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించి తెలుగు ప్రజలకు సుపరిచితుడయ్యాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో వైద్యం సహాయం పొందుతున్నారు. అమ్మోరు, పెదరాయుడు, మజ్ను, కొండవీటి సింహం, పెదరాయుడు, అమ్మోరు, గోరింటాకు తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌ లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు జనార్థనరావు. ‘గోకులంలో సీత‌’, ‘త‌లంబ్రాలు’ వంటి సీరియ‌ల్స్‌లోనూ న‌టించి మెప్పించారు. చివరిసారిగా జనతా గ్యారేజ్ సినిమాలో నటించాడు. జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌‌తో కీలకమైన సన్నివేశంలో నటించారు జనార్ధన రావు. అందులో గవర్నమెంట్ ఆఫీస్‌లోకి రౌడీలు వచ్చినపుడు ఎన్టీఆర్ మాట్లాడేది ఈయనతోనే.

Image result for జనార్ధన రావు

ఇక సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ వివిధ అసోషియేషన్స్‌లో తన సేవలను అందిచారు. సౌత్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్‌ సభ్యుడిగా పనిచేసిన ఆయన సేవలకు గాను జాయింట్ సెక్ర‌ట‌రీ అయ్యారు. 40 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ లో జనార్దన్ రావు దిగ్గజాలు ఎన్టీఆర్ సహా అనేకమంది అగ్రహీరోల చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. జనార్దన్ రావు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. టాలీవుడ్ ప్రతిభావంతుడైన సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు. జనార్ధన్ రావు మృతి వార్త తెలిసిన వెంటనే వారు స్పందించారు. జనార్ధన్ రావుతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు బెనర్జీ. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

Content above bottom navigation