స్టార్‌ ప్రొడ్యూసర్‌కు కరోనా పాజిటివ్.

దేశానికి ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ నిద్ర‌లేకుండా చేస్తోంది, ముఖ్యంగా లాక్ డౌన్ వేళ ఎవ‌రూ బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు….బాలీవుడ్ ఇండస్ట్రీని వైర‌స్ భయపెడుతోంది. ఇప్పటికే లాక్ డౌన్‌ కారణంగా బాలీవుడ్ వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీనికి తోడు సినీ ప్రముఖులు కూడా వైర‌స్ పాజిటివ్‌గా తెలుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది. ఇటీవల కనికా కపూర్‌ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. వైర‌స్ సోకిన తరువాత ఆమె అనేక మందితో కలిసి పార్టీల్లో పాల్గొనటం సంచలనంగా మారింది. ఇటీవల కనికా దీని నుంచి బయట పడి డిశ్చార్జ్‌ అయ్యింది.

ప్రముఖ నిర్మాత కూతురుకు కరోనా ...
వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

తాజాగా బాలీవుడ్‌ ఇండస్ట్రీ మరో షాకింగ్ న్యూస్‌ షేక్‌ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ కరిమ్ మోరాని కూడా వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన కరిం కూతురు షాజా ముందుగా వైర‌స్ పాజిటివ్‌ గా తెలింది. ఈ విషయాన్ని కరిం స్వయంగా ప్రకటించారు. అయితే ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు కూడా టెస్ట్ చేయించుకోవటంతో ఆయన రెండో కూతురు జోయాతో పాటు ఆయ‌న‌కు కూడా వైర‌స్ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది.

టాప్ లెస్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసిన కాజల్..

కరింకు వైర‌స్ పాజిటివ్‌ వచ్చినట్టుగా ఆయన సోదరుడు మొహమ్మద్‌ మోరానీ అధికారికంగా ధృవీకరించాడు. ప్రస్తుతం ఆయన నానావతి ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, ఇంట్లో ఆయన భార్య, పనివారికి కూడా టెస్ట్ లు నిర్వహించారని వారందరికీ నెగెటివ్‌ వచ్చినట్టుగా ఆయన వెళ్లడించారు. కరిం షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన రావన్‌, చెన్నై ఎక్స్‌ ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయిర్‌, దిల్ వాలే లాంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు.

Content above bottom navigation