షాకింగ్ కబళించిన కరోనా.. ప్రముఖ నటుడు మృతి

దేశవిదేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా మహమ్మారి ఓ నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ ఆండ్రూ జాక్ మృతి చెందారు. వివరాల్లోకి పోతే..ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. చైనా దేశంలో పుట్టి ఇప్పటికే 202 దేశాలకు విస్తరించిన ఈ వైరస్ 42 వేల మందిని బలి తీసుకోవడంతో అంతా వణికిపోతున్నారు. ఈ కరోనా బారిన పడిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

Muere el actor de 'Star Wars' Andrew Jack a causa del coronavirus ...

తాజాగా ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ ఆండ్రూ జాక్ కరోనా పాజిటివ్ తో లండన్‌లో చనిపోయారని తెలిసింది. అతను సర్రే ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారని అతని మేనేజర్ జిల్ మెక్ కల్లౌ మీడియాకు తెలిపారు. స్టార్ వార్ యాక్టర్‌గా ఆండ్రూ జాక్ ప్రజాధారణ పొందారు.ఆండ్రూ జాక్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు రెండురోజుల క్రితం నిర్దారణ అయ్యిందని ఆయన భార్య గ్యాబ్రియెల్ రోజర్స్ తెలిపారు. వైరస్ సోకిందనే బాధ అతనిలో కనిపించలేదని ఆమె అన్నారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అతని జ్ఞాపకాలతో తాము ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్నారు.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

ఇప్పటికే అమెరికన్ సింగర్ జో డిఫీ (61) కరోనా సోకి మరణించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రిందటే హాలీవుడ్‌ హీరోయిన్‌ సోఫియా మైల్స్‌ తండ్రి పీటర్‌ మైల్స్‌ కరోనా బారినపడి మరణించారు. దీంతో హాలీవుడ్ సహా అన్ని సినీ పరిశ్రమలు కరోనా భయంలో విలవిలలాడుతున్నాయి.

Content above bottom navigation