మనో మంచి సింగర్ కానీ మంచి మగాడు మాత్రం కాదు.. సింగర్ చిన్మయి సంచలన వీడియో ..

123

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువైన సింగర్ చిన్మయి. అయితే ఆ మద్య చిన్మయి మీటూ ఆరోపణలతో సంచలనం సృష్టించింది. తమిళ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకున్న స్టార్ స్టేటస్ ఏమవుతుందన్నది పక్కన పెట్టి.. నిజం కోసం.. న్యాయం కోసం ఆమె భారీ పోరాటమే చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళను ఢీ కొంటున్నారు. ఈ క్రమంలో తన వద్దకు వచ్చే రాజీ అంశాల్ని సైతం ఓపెన్ చేసేస్తూ షాకిస్తున్నారు. సౌత్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మనో. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియా ప్రేక్షకులు అందరికి పరిచయం ఉన్న మనో, తన కామెడీ టైమింగ్, మాటలతో ఎక్కడ ఉన్న సందడి చేస్తూ సరదాగా ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి ఎవరైనా తప్పుగా ఆరోపణలు చేస్తే అందులో వాస్తవం ఉందా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా మనోపై చిన్మయి సంచలన కామెంట్స్ చేసింది. అసలేమైందంటే..

Image result for mano chinmayi

చిన్మయి స్టార్ సింగర్ కార్తీక్ మీద లైంగిక ఆరోపణలు చేయటం తెలిసిందే. తన మీద కక్ష్య కట్టి, అవకాశాలు రాకుండా చేసినా, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తీసేసినా, వెనక్కి తగ్గని ఈ ఫైర్ బ్రాండ్ తాజాగా చేసిన ఏ ట్వీట్ సంచలనంగా మారింది. సింగర్ కార్తీక్ మీద తాను చేసిన ఆరోపణలు ఒక కొలిక్కి రానప్పటికి, అతగాడికి డబ్బింగ్ యూనియన్ లో చోటు దక్కటం విశేషం. డబ్బింగ్ యూనియన్ ఎన్నికల బరిలో దిగాలనుకున్న చిన్మయికి అవకాశం లేకుండా చేసిన నేపథ్యంలో సింగర్ మనో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే మనో వీడియోకు కౌంటర్ ఇస్తూ చిన్మయి మరొక సంచలన వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో మనోకు కౌంటర్ ఇచ్చింది.

ఈ క్రింది వీడియోని చూడండి

స్టార్ గాయకుడు కార్తీక్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత మనో నాకు ఫోన్ చేశారు. ఇంటికి రావాలని పిలిచారంటూ.. ‘‘నువ్వు చేసిన ఆరోపణలతో కార్తీక్ భార్య బాధ పడుతోంది. ఏడుస్తోంది. అతడి కెరీర్ నాశనం చేయకు. నువ్వు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నావు. కార్తీక్ అంతే. ప్రస్తుతం అతడు మంచి స్థానంలో ఉన్నాడు. దాన్ని పాడు చేయకు అంటూ మనో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు’’ అంటూ చిన్మయి ఓపెన్ అయ్యింది. మనో రాజీపై బదులిచ్చిన చిన్మయి.. ప్రొఫెషన్ పరంగా కార్తీక్ మీద తనకు గౌరవం ఉందని, ఎంతో కష్టపడి అతడు పైకి వచ్చాడని పేర్కొంది. తాను కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొని గుర్తింపు సొంతం చేసుకున్నానని, కానీ పైకి వచ్చిన తర్వాత మాత్రం కార్తీక్ మాదిరి చెడుగా ఎవరూ ప్రవర్తించలేదన్నారు. అంతలా వేధింపులు కూడా ఎవరూ చేయలేదన్న ఆమె, మరో ఘాటు వ్యాఖ్య చేశారు. మనో.. కార్తీలు మంచి సింగర్స్ కావొచ్చు. కానీ.. వారిద్దరూ మంచి మగాళ్లు మాత్రం కాదని తనదైన శైలిలో పంచ్ ట్వీట్ చేశారు చిన్మయి. తాను చేస్తున్న పోరాటంలో ఇంత ఓపెన్ గా ఉండటం ఆమెకు మాత్రమే సాధ్యమవుతుందేమో?

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation