తన కంటే 37 ఏళ్ల పెద్దాయనతో హీరోయిన్ ఎఫైర్.. షాక్ లో తోటి నటులు

59

ప్రస్తుత కాలంలో ప్రేమికులకు ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్యగా లేదు. ఎక్కువ వయసున్న వారితో లవ్వు అంటే అదో హాట్ టాపిక్ గా మారింది.. ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో ఇలా ఏజ్ గ్యాప్ ఉన్నవాళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకున్నారు. సినీ సెలెబ్రిటీల మధ్య ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మరొక సినీ సెలెబ్రిటీ జంట ఇదే విషయంలో హాట్ టాపిక్ అయ్యింది. తనకంటే దాదాపు 37 ఏళ్లు పెద్ద వాడైన వ్యక్తితో హాట్ గర్ల్ పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. అతడితో రొమాన్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరీ భామ? ఆమె ప్రేమించిన ఆ లేట్ వయసు హీరో ఎవరు? ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ సింగర్ అనూప్ జలోటా, నటి జస్లీన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఏజ్ ఆమె కంటే 37ఏళ్లు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రేమజంట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. పబ్లిక్ వేదికలపైనే ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించేకుంటూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. హిందీ బిగ్ బాస్ షో చూసే వాళ్లకు ఈ జంట రొమాన్స్ ను చూడటం కొత్తేమీ కాదు. బిగ్ బాస్ వేదికపై ఫేమస్ కావడంతో ఇప్పుడు బయట కూడా వీళ్లు హాట్ టాపిక్ గా మారిపోయారు. \

అనుప్- జస్లీన్ జంట త్వరలో వివాహం చేసుకోబోతున్నారట. బిగ్ బాస్ షోతో పాపులరైన జస్లీన్ వేడెక్కించే ఫోటోషూట్లు సోషల్ మీడియాలో యూత్ కి మత్తెక్కిస్తున్నాయి. స్విమ్ సూట్.. బికినీ.. టూపీస్.. లలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అందం చందం.. అదిరి పోయే శరీరాకృతితో ఉండే జస్లీన్ లుక్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు.

Image result for తన కంటే 37 ఏళ్ల పెద్దాయనతో హీరోయిన్ ఎఫైర్

ఆధ్యాత్మిక సింగర్ అయిన అనుప్ జలోటా జస్లీన్ కి గురువు. టీచర్ తోనే ప్రేమలో పడి, ఇప్పుడు పెళ్ళికి రెడీ అవుతున్నారు. జస్లీన్ నేపథ్యం పరిశీలిస్తే.. ఆమె పూర్తి పేరు జస్లీన్ మథారు. 11 ఏళ్ల వయసుకే క్లాసికల్ తో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు గురువును వెతుక్కుంది. ఇంటర్ చదివేప్పుడు కాలేజ్ కాంపిటీషన్ లో బెస్ట్ ఫిమెల్ సింగర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత గాయనిగా కెరీర్ ని స్టార్ట్ చేసి తనకంటూ సొంత అభిమానుల్ని సంపాదించుకుంది. లవ్ డే అనే ఆల్బమ్ లోనూ సింగర్ గా మెప్పించింది. మికా సింగ్- సుఖ్వీందర్ సింగ్- అంజాద్ ఖాన్ వంటి టాప్ సెలబ్రిటీలతో లైవ్ షోలు నిర్వహించి పాపులర్ అయ్యింది. ద డర్టీ రిలేషన్ మూవీతో యాక్ట్రెస్ గా సినీరంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం నటన పైనా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. చూడాలి మరి చివరికి ఇద్దరు పెళ్లి చేసుకుంటారో, లేక చివరి క్షణాల్లో క్యాన్సిల్ చేసుకుంటారో..

Content above bottom navigation