ఉదయ్ కిరణ్ గురించి సునీల్ చెప్పిన నిజాలు వింటే షాక్….

284

ఉదయ్ కిరణ్…తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు ఉండే పేరు.ఎలాంటి ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలలోకి వచ్చి తనకంటూ ఒక స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు.యూత్ ను ఎక్కువగా అట్రాక్ చేసి అమ్మాయిల మనసులను దోచుకున్నాడు.లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.మెగాస్టార్ చిరంజీవికి అల్లుడయ్యే అవకాశాన్ని కొన్ని కారణాలవల్ల కోల్పోయిన ఉదయ్ కిరణ్ ఆతరువాత సినిరంగం లోను ఒక డౌన్ ఫాల్ ను చవిచుసాడు. కారణం ఏంటో ఖ‌చ్చితంగా తెలియ‌క పోయినా ఉదయ్ కిరణ్‌కు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.అయితే అతను చనిపోడానికి వివిధ కారణాలు ఉన్నాయని అప్పట్లో మీడియాలో వచ్చాయి.ముఖ్యంగా చిరంజీవి అనే కారణం ఉంది. ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన సునీల్ ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను తలుచుకుని బాధపడుతున్నాడు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళ్తే..

Image result for ఉదయ్ కిరణ్

చిత్రం, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. వచ్చిన చాన్సులు నిలబడక, కొత్త అవకాశాలు రాక ఉదయ్ కిరణ్ కెరీర్ ముగిసే స్థితికి చేరింది. ఆ టైమ్‌ లో ఈ ఇష్యూపై టాలీవుడ్‌ లో పెద్ద చర్చలే నడిచాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ఊహించని రీతిలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సొంతింట్లోనే ఉరేసుకొని చనిపోయారు. దీంతో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. ఆయన మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ పరిశ్రమ నిర్ఘాంత పోయింది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆయనతో తెర పంచుకున్న ఎందరో నటీనటులు స్పందిస్తూ పలు విషయాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే సునీల్ కూడా ఉదయ్ కిరణ్ గురించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్‌ తో కలిసి నువ్వ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించిన సునీల్ సెట్‌లో ఉదయ్ కిరణ్ ఎలా కష్టపడేవారో గుర్తుచేసుకున్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి

‘నువ్వు నేను’ షూటింగ్ సమయంలో.. ఓ రన్నింగ్ రేస్ సీన్ కోసం నిజమైన రన్నర్‌ లను డైరెక్టర్ తేజ తీసుకొచ్చారని, అయితే వాళ్లతో కలిసి ఉదయ్ కిరణ్‌ను పరిగెత్తాలని కోరగా వాళ్లతో నిజంగానే పరిగెత్తి ఉదయ్ కిరణ్ గెలిచారని చెప్పాడు సునీల్. ఆ సంఘటన యూనిట్ లో ఉన్న అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంత స్పీడ్‌ గా ఎలా పరిగెత్తావని ఉదయ్‌ ని అడిగితే, చిన్నప్పుడు బస్సుల వెంట పరుగెత్తి అలవాటయిందని చెప్పాడు. దాంతో యూనిట్ సభ్యులందరు కూడా పగలబడి నవ్వారు. ఆ సినిమా తర్వాత మా స్నేహం మరింత పెరిగింది. దాదాపుగా ఉదయ్ కిరణ్ నటించిన అన్ని సినిమాలలో నేను కూడా నటించాను. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. కానీ ఒకానొక సమయంలో వరుస ప్లాప్స్ రావడం, అవకాశాలు తగ్గడం ఉదయ్ కిరణ్ తట్టుకోలేకపోయాడు. ఇది ప్రతి ఒక్క నటుడికి ఎదురయ్యే పరిస్థితులే. వాటిని అధిగమించి సక్సెస్ అయినా వాళ్ళు ఎందరో. కానీ భవిష్యత్ గురించి అలోచించి, ఇక తనకు సినీ కెరీర్ ఉండదని భావించి సూసైడ్ చేసుకోవడం బాధ కలిగించింది. ఎప్పుడు సరదాగా ఉండే మనిషి ఆత్మహత్య చేసుకోవడం నేను జీర్ణించుకోలేకపోయానని సునీల్ అన్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation