తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం

తెలుగు చిత్రసీమలో విషాద ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జ‌రుగుతున్నాయి… సినిమా లోకాన్ని క‌న్నీరు పెట్టిస్తున్నాయి, తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం మరణించారు. ఎన్నో సినిమాలకు పీఆర్ఓగా సేవలందించిన అనుభవం పసుపులేటి రామారావు సొంతం. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు పసుపులేటి రామారావు. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్దల తలలో నాలుకగా ఉన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన ఓ మహా నిఘంటువు పసుపులేటి రామారావు గారు.

Image result for పసుపులేటి రామారావు

ఆయన మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేసారు. ఆ తరువాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా జర్నలిస్ట్‌గా పనిచేసారు. ప్రస్తుతం ‘సంతోషం’ సినీ పత్రికకు జర్నలిస్ట్‌‌గా పనిచేస్తున్నారు. పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్ గా పనిచేసారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా నేటి యంగ్ హీరోలను సైతం ఇంటర్వ్యూలు చేసిన అనుభవం పసుపులేటి రామారావుకు ఉంది.

Image result for పసుపులేటి రామారావు

యన్.టి.ఆర్, ఎ.ఎన్.అర్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు…….. ఆ తరువాత తరం చంద్రమొహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్…… అలాగే ఇప్పటి తరం హీరొలతోను, హీరోయిన్ల తో, పెద్ద చిన్న నిర్మాతలతోను, 24 భాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులతోను ఇంటర్య్వులు తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన కొన్నింటిని నాటి మేటి సినీ ఆణిముత్యాలు అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆయ‌న‌కు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ నివాళి అర్పించింది ..ఆయ‌న ఇంటికి స్టార్ హీరోలు వ‌రుస‌గా వ‌స్తున్నారు. అప్ప‌ట్లో సినిమా వార్త‌లు అంటే ఆయ‌న పేరే వినిపించేది.. ఎంత పెద్ద స్టార్ హీరో ద‌గ్గ‌ర‌కి అయినా ఆయ‌న నేరుగా వెళ్లేవారు, ద‌ర్శ‌కులు నిర్మాత‌లు హీరోలు హీరోయిన్లు ఆప్యాయంగా ఆయ‌న‌ని పిలిచి ఇంట‌ర్వ్యూలు ఇచ్చేవారు, అంత గొప్ప వ్య‌క్తి నేడు లేరు అంటే చిత్ర ప‌రిశ్ర‌మ త‌ట్టుకోలేక‌పోతోంది, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌నం కూడా కోరుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి:

Content above bottom navigation