యాంకర్స్ లలో ఎవరి ఆస్తి ఎంత? ఎన్ని కోట్లు సంపాదించారు?

104

యాంకరింగ్ అనేది అంత తేలికైన విషయం కాదని మన అందరికి తెలుసు. బాష మంచిగా వచ్చి ఉండాలి. సమయానికి తగ్గట్టు మాట్లాడుతూ జనాలను మాటలతోనే కట్టిపడెయ్యాలి. అప్పుడే వారి యాంకరింగ్ కు పేరు వస్తుంది. మహిళలు ఈ రంగంలో నెగ్గుకురావడం పెద్ద కష్టమేమి కాదు కానీ మగాళ్లు ఈ రంగంలో రాణించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. తెలుగు టెలివిజన్ తెర గురించి మాట్లాడాలంటే చాలామంది మేల్ యాంకర్స్ ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే మంచి పేరు తెచ్చుకున్నారు. అలా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న మేల్ యాంకర్స్ లలో ప్రదీప్, యాంకర్ రవి, సుడిగాలి సుదీర్, హైపర్ ఆది ఉన్నారు. వీళ్లకు సెపరేట్ ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఇంత పేరు ఉన్న వీళ్ళు ఎంత సంపాదిస్తారో మీకు తెలుసా? వీళ్ళు కూడబెట్టిన ఆస్తిపాస్తుల వివరాలు మీకు తెలుసా? ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రదీప్ మాచిరాజు….తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.. ప్రదీప్ చేతిలో దాదాపు అర డజన్ కు పైగా షోస్ ఉన్నాయి. బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్, గడసరి అత్త సొగసరి కోడలు, అదుర్స్, నర్తనశాల, ఎక్స్ ప్రెస్ రాజా, ఢీ, కిక్, డ్రామా జూనియర్స్ లాంటి షోలకు యాంకరింగ్ చేశాడు. ఇందులో కొన్ని షోలు ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. ఇక తన సొంత ప్రొడక్షన్ లో కొంచెం టచ్ లో ఉంటె చెప్తా లాంటి షోను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే హీరో అయ్యాడు. ప్రతి రోజు 18 గంటలు షూటింగ్స్ తోనే గడుపుతుంటాడు ప్రదీప్.ప్రదీప్ సంపాదన విషయానికి వస్తే..

Image result for anchor pradeep

తెలుగు బుల్లితెర మీద ప్రదీప్ కు ఉన్నంత డిమాండ్ ఇంకెవరికి లేదు. నెంబర్ 1 యాంకర్ కావడంతో ప్రదీప్ అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు షో నిర్మాతలు. ప్రదీప్ ఒక్క షోకు 3 లక్షల వరకు తీసుకుంటున్నాడు. సినిమా ఫంక్షన్స్ కు అయితే ఒక్క ఫంక్షన్ కు దాదాపుగా 5 లక్షల వరకు తీసుకుంటున్నాడు. ఇక ప్రదీప్ కొన్ని సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్యనే హీరోగా మారాడు. ప్రదీప్ ఆ సినిమాకు 30 లక్షల రూపాయలను తీసుకున్నాడంట. మొదటి సినిమా కాబట్టి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాలకు రెమ్యునరేషన్ పెంచాలని అనుకుంటున్నాడట. ఇక తన సొంత ప్రొడక్షన్ లో చేసే కొంచెం టచ్ లో ఉంటె చెప్తా షో కూడా బాగానే సంపాదించి పెట్టింది. ఇక ప్రదీప్ కూడబెట్టిన ఆస్తుల విషయానికి వస్తే..ప్రదీప్ కు బంజారా హిల్స్ లో దాదాపు 5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఇదే కాకుండా కోటిన్నర విలువ చేసే BMW కారు ఉంది. ఇదే కాకుండా 30 లక్షలు విలువ చేసే ఇన్నోవా కూడా ఉంది. ఇక ప్రదీప్ కు వికారాబాద్ ఫారెస్ట్ సైడ్ ఒక ఫార్మ్ హౌస్ ఉంది. దాని విలువ దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఓవరాలుగా చూసుకుంటే ప్రదీప్ కు దాదాపుగా 20 కోట్ల ఆస్థి ఉంది.

ఇక మేల్ యాంకర్స్ లలో మరొకరి గురించి ప్రస్తావించాల్సి వస్తే యాంకర్ రవి గురించి ప్రస్తావించాలి. రవికి కూడా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. రవి చేతిలో ఇప్పుడు దాదాపు నాలుగైదు పోగ్రామ్స్ నడుస్తున్నాయి. రవి పోగ్రామ్స్ విషయానికి వస్తే.. మా టీవీ లో సంథింగ్ స్పెషల్, డీ జూనియర్స్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, కిరాక్ కామెడీ, పటాస్, పటాస్ 2, గ్యాంగ్ లీడర్స్, సూపర్ మామ్, సరిలేరు మీకెవ్వరు లాంటి షోలు ఉన్నాయి. వీటిలో కొన్ని షోలు ఇప్పటికి నడుస్తునే ఉన్నాయి. ఒక్కసారి రవి సంపాదన విషయానికి వస్తే..

Image result for anchor ravi


బుల్లితెర మీద ప్రదీప్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న యాంకర్ రవి. రవి ఒక్కొక్క షోకు 2 లక్షల రూపాయలు తీసుకుంటాడు. సినిమా ఫంక్షన్స్ కు కూడా 2 లక్షలు తీసుకుంటాడు. ఇక హీరోగా కూడా ఒక సినిమాలో నటించాడు. ఈ సినిమాకు దాదాపు 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక రవి కూడబెట్టిన ఆస్తుల విషయానికి వస్తే.. రవికి బంజారా హిల్స్ లో కోటి విలువ చేసే ఒక ప్లాట్ ఉంది. అలాగే రవికి 30 లక్షలు విలువ చేసే నిస్సాన్ సన్నీ అనే కారు ఉంది. ఓవరాలుగా చూసుకుంటే రవికి 5 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి.

ఇక యాంకర్స్ లలో మరొకరి గురించి ప్రస్తావించాల్సి వస్తే సుడిగాలి సుదీర్ గురించి ప్రస్తావించాలి. సుదీర్ కు యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, ఢీ, పోరా పోవే షోలతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ కు పెంచుకున్నాడు. అలాగే కొన్ని సినిమాల్లో కమిడియన్ గా నటించాడు. అలాగే ఈ మధ్యనే హీరో అయ్యాడు. ఒక్కసారి సుదీర్ సంపాదన విషయానికి వస్తే..

Image result for sudigali sudheer

సుదీర్ ప్రస్తుతం బుల్లితెర మీద డిమాండ్ ఉన్న వ్యక్తి. ఇతను రశ్మితో కలిసి పోగ్రామ్ చేస్తున్నాడు అంటే ఎంత ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు షో నిర్వాహకులు. సుదీర్ ఇప్పుడు ఒక్క షోకు రెండున్నర లక్షల వరకు తీసుకుంటున్నాడు. ఇక సినిమాల్లో కూడా కమిడియన్ గ బాగానే నటిస్తున్నాడు. సినిమాలో డేట్స్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఒక్క రోజుకు దాదాపుగా 20 వేల వరకు తీసుకుంటున్నాడు. ఈ మధ్యనే హీరోగా కూడా మారాడు. మొదటి సినిమాకు కేవలం 20 లక్షలు తీసుకున్న సుదీర్ రెండవ సినిమాకు 30 లక్షల వరకు తీసుకున్నాడు. ఇక సుదీర్ కూడబెట్టిన ఆస్తిపాస్తుల విషయానికి వస్తే.. సుదీర్ కు బంజారా హిల్స్ లో కోటి విలువ చేసే ఒక ప్లాట్ ఉంది. అలాగే సొంతూరు విజయవాడ దగ్గర ఒక ఇల్లు ఉంది. దీని విలువ 50 లక్షల వరకు ఉంటుంది. ఇక సుదీర్ నిస్సాన్ కంపెనీకి చెందిన 30 లక్షల కారు, వోల్క్స్ వాగెన్ కంపెనీకి చెందిన 40 లక్షల విలువ చేసే కారు ఉంది. అలాగే సొంతూరు లో 10 ఎకరాల పొలం ఉంది. దీని విలువ దాదాపు కోటి వరకు ఉంటుంది. ఓవరాలుగా సుదీర్ ఆస్థి విలువ చుస్తే దాదాపుగా 5 కోట్ల వరకు ఉంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక బుల్లితెర మీద రాణిస్తున్న వారిలో మరొకరి గురించి ప్రస్తావించాల్సి వస్తే హైపర్ ఆది గురించి ప్రస్తావించాలి. జబర్దస్త్ అనే షో తో హైపర్ ఆది తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన వేసే పంచులకు ఎవరైనా సరే పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఆయనలో మంచి రైటర్ ఉన్నాడు. అందుకే కొన్ని సినిమా ఆఫర్స్ కూడా అందుకున్నాడు. కమిడియన్ గా, రైటర్ గా సినిమాల్లో రాణిస్తున్నాడు. అలాగే ఢీ డాన్స్ రియాలిటీ షోలో టీమ్ లీడర్ గా ఉన్నాడు. హైపర్ ఆది సంపాదన విషయానికి వస్తే…

Image result for hyper aadi

బుల్లితెర మీద హైపర్ ఆదికి కూడా భారీ డిమాండ్ ఉంది. కమిడియన్ గా, రైటర్ గా బాగా ఛాన్సులు అందుకుంటున్నాడు. ఇతను ఒక్క షోకు 2 లక్షల వరకు తీసుకుంటున్నాడు. ఇక సినిమాకు అయితే 10 లక్షల వరకు తీసుకుంటున్నాడు. తానూ నటించే సినిమాలో తన క్యారెక్టర్ కు తానే డైలాగ్స్ రాసుకుంటున్నాడు. అందుకే హైపర్ ఆదికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నాడు. ఇక ఆది కూడబెట్టిన ఆస్తుల విషయానికి వస్తే..ఆదికి హైదరాబాద్ లో 50 లక్షల విలువ చేసే ఒక ప్లాట్ ఉంది. అలాగే సొంతూరు లో 30 లక్షలు విలువ చేసే ఇల్లు ఉంది. ఇక ఆది వద్ద స్కోడా కంపెనీకి చెందిన 30 లక్షలు విలువ చేసే కారు ఉంది. ఇక సొంతూరు లో 50 లక్షలు విలువ చేసే 5 ఎకరాల పొలం కూడా ఉంది. ఓవరాలుగా చుస్తే హైపర్ ఆది ఆస్థి విలువ దాదాపు 3 కోట్ల వరకు ఉంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation