నితిన్‌ అత్తింటివారితో చిరంజీవికి అనుబంధం..

76

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో నితిన్ ఒకరు. నితిన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా, ఏ ఫంక్షన్‌కు వెళ్లినా ఆయన్ని తప్పకుండా అడిగే ప్రశ్న మీ పెళ్లెప్పుడు. మొత్తానికి ఆ ప్రశ్నలకు పుల్‌స్టాప్ పెట్టేశారు నితిన్. తాను పెళ్లిచేసుకోబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మొన్న శనివారం రోజున ఎంగేజ్ మెంట్ కూడా కంప్లీట్ అయ్యింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ అంగరంగవైభవంగా జరిగింది. ఇక వీరి వివాహ వేడుక ఏప్రిల్ 16న దుబాయ్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. అనంతరం ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో బంధుమిత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

ఇక్కడ సర్‌‌ప్రైజ్ ఏంటంటే నితిన్‌ది లవ్ మ్యారేజ్. నితిన్ పెళ్లి కుదిరింది అంటే అంతా పెద్దలు కుదిర్చిన వివాహం ఏమో అనుకున్నారు. కానీ, తనది లవ్ మ్యారేజ్ అని నితిన్ ఇటీవల చెప్పారు. షాలినితో తనది ఎనిమిదేళ్ల ప్రయాణం అని చెప్పారు. అంతకు మించి షాలిని రెడ్డి గురించి చిన్న విషయం కూడా బయటపెట్టలేదు. దీంతో ఎవరు ఈ షాలిని అని చాలా మందిలో ఆసక్తి పెరిగింది. షాలిని రెడ్డి కందుకూరి తెలంగాణలోని నాగర్ కర్నూల్ అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ ను నడుపుతున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఇప్పుడు తమ రెండో కుమార్తె షాలినికి కూడా ప్రేమ వివాహమే చేస్తున్నారు.

Image result for నితిన్‌ అత్తింటివారితో చిరంజీవికి అనుబంధం..

అయితే డాక్టర్ నూర్జహాన్‌ కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. నూర్జహాన్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి సినిమాలు అంటే పడిచచ్చిపోతుంది. పేరుకు డాక్టర్ అయినా మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చింది అంటే మొదటి రోజు మొదటి షో చూసే అంత పెద్ద అభిమాని. అంతేకాదు చిరంజీవికి, నూర్జహాన్ కు రాజకీయపరంగా కూడా ఉంది.. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు నూర్జహాన్ పార్టీలో చేరారు. నాగర్ కర్నూల్ ను నూర్జహాన్ కు డాక్టర్ గా మంచి పేరు ఉండడంతో చిరంజీవి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం సీటును నూర్జహాన్‌కు ఇచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లో నూర్జహాన్ ఓడిపోయారు. ఆ తరవాత ప్రజారాజ్యం పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నూర్జహాన్ వేరే ఏ ఇతర పార్టీలో జాయిన్ అవ్వలేదు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ ఇప్పుడు నితిన్, షాలిని పెళ్లితో ఆమె వార్తల్లోకి వచ్చారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation