పెళ్లిపీటలు వరుకు వచ్చి ఆగిపోయిన ప్రేమ జంటలు

ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని చాలా మంది ప్రేమికులు భావిస్తారు.కాని కొన్ని కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల వారి మ‌న‌స్ప‌ర్ద‌ల మూలంగా కులాలు మ‌తాల ప‌ట్టింపుల‌తో ప్రేమ‌కి బ్రేక్ వేస్తారు.అయితే ఇది సినిమా ప‌రిశ్ర‌మ‌లో కూడా ఉంది. సినిమా హీరో హీరోయిన్ ,ద‌ర్శ‌కుడు హీరోయిన్, నిర్మాత హీరోయిన్, ఇలా ఒక‌టైన జంట‌లు చాలా ఉన్నాయి.టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ లో చాలా జంట‌లు ఇలా పెళ్లి చేసుకున్నాయి
ఇక బుల్లితెర‌లో కూడా ప‌లువురు యాంక‌ర్స్ సింగ‌ర్స్ టెలివిజ‌న్ నటీన‌టులు ఒక్క‌టైన జంట‌లు చాలా ఉన్నాయి.అయితే సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇలా పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వెళ్లి పెళ్లి క్యాన్సిల్ అయిన జంట‌లు ఏమున్నాయో చూద్దాం.

Image result for udhya kiran

ఉద‌య్ కిర‌ణ్
చిత్రం సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఉద‌య్ కిర‌ణ్ ..ల‌వ‌ర్ బాయ్ గా తెలుగు చిత్రాల‌కే కేరాఫ్ అడ్ర‌స్ అయ్యారు, అయితే ఈ స‌మ‌యంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత‌ని ప్రేమించారు వీరిద్ద‌రూ ప్రేమించుకోవ‌డంతో చిరంజీవి కుటుంబం కూడా వీరి పెళ్లికి ఒకే చెప్పింది.. ఎంగేజ్ మెంట్ కూడా నిర్వ‌హించుకున్నారు, అయితే ఆ త‌ర్వాత ఏమైందో ఏమో ఇద్ద‌రికి మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల్ల ఉద‌య కిర‌ణ్ సుస్మిత పెళ్లి కాన్సిల్ అయింది, త‌ర్వాత వేరు వేరుగా వివాహాలు జ‌రిగాయి, త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ కి ఎక్క‌డా సినిమా అవ‌కాశాలు రాక చివ‌రి వ‌ర‌కూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Image result for tharun

త‌రుణ్
నువ్వేకావాలి చిత్రంతో త‌రుణ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు, ఇలా ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.. త‌ర్వాత నువ్వులేక నేను లేను చిత్రంలో ఆర్తీ అగ‌ర్వాల్ తో న‌టించాడు.. ఈ స‌మయంలో ఆమెతో ల‌వ్ ట్రాక్ న‌డిపాడు.. ఇద్ద‌ర‌కి ఇష్టం కావ‌డంతో టాలీవుడ్ అంతా వీరి గురించి మాట్లాడుకున్నారు.. ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటారు అనుకునే స‌మ‌యంలో వీరు బ్రేక‌ప్ చెప్పుకున్నారు, త‌ర్వాత ఆమె అమెరికాలో సెటిల్ అయింది, అయితే కొన్నేళ్ల క్రితం ఓ ఆప‌రేష‌న్ విక‌టించి ఆమె క‌న్నుమూశారు.

Image result for trisha

త్రిష
త‌మిళ‌నాడుకి చెందిన ఈ భామ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సినిమా రంగంలో సంపాదించుకుంది, ఇక సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో వ్యాపారవేత్త వ‌రుణ్ తో ఆమెకు నిశ్చితార్ధం కూడా అయింది.. అయితే త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో వారి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు..

Image result for nayanthara

న‌య‌న‌తార
టాలీవుడ్ లో న‌య‌న‌తార అగ్ర‌హీరోలు అంద‌రితో సినిమాలు చేసింది.. ఆమె ఇటీవ‌ల న‌టుడు డ్యాన్స‌ర్ ప్ర‌భుదేవాతో ప్రేమ‌లో మునిగిపోయింది, అయితే ప్ర‌భుదేవా ఆమెని వివాహం చేసుకునేందుకు త‌న భార్య‌కు విడాకులు కూడా ఇచ్చాడు ..కాని వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో వీరి పెళ్లి క్సాన్సిల్ అయింది.

శింబు- హ‌న్సిక
శింబు హ‌న్సిక గురించి కోలీవుడ్ కోడై కూసింది.. ఇద్ద‌రు వివాహం చేసుకుంటారు అని అంద‌రూ భావించారు.. కాని హ‌న్సిక ఉన్న‌ట్లు ఉండి శింబూని ప‌క్క‌న పెట్టేసింది.. వీరి వివాహం కూడా పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వెళ్ల‌లేదు.

ఈ క్రింది వీడియోని చూడండి

అఖిల్
అక్కినేని అఖిల్ చిన్న‌నాటి స్నేహితురాలు శ్రేయా భూపాల్ ని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు.. ఇద్ద‌రూ చిన్న‌త‌నం నుంచి మంచి ఫ్రెండ్స్.. అలా ప్రేమించుకున్నారు కాని ఎంగేజ్ మెంట్ తర్వాత మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో ఇద్ద‌రూ విడిపోయారు..

ఇలా చాలా మంది అగ్ర‌హీరోలు హీరోయిన్లు ప‌లువురు న‌టులు పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వెళ్లి పెళ్లి క్సాన్సిల్ చేసుకున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation