పెళ్ళైన ఏడాది లోపే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన టాలీవుడ్ సెలెబ్రిటిలు

106

సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. వాళ్లలో వాళ్లకు కుదరక, పొత్తు పడక, అభిప్రాయాలు కలవక పెళ్లైన తర్వాత విడిపోయి విడాకులు తీసుకున్న జంటలు చాలామంది ఉన్నారు. అయితే కొందరు మాత్రం పెళ్ళై ఏడాది కూడా గడవకముందే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా విడాకులు తీసుకున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for kirthee reddy

నటి రాధిక 1985లో నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ ని పెళ్లిచేసుకుంది. కానీ ఏడాది లోపే చాలా గొడవలు అవ్వడంతో విడిపోయారు. ఇప్పటికీ ప్రతాప్ పోతన్ పేరు వినిపిస్తే ఒంటికాలిపై లేస్తుంది. ఇక మంచు వారబ్బాయి మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లకే వీరిద్దరి మధ్యా తేడాలొచ్చేశాయి. సడన్ గా ఇల్లు వదిలేసి ఆమె అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత విడాకులు తీసుకున్నట్లు మనోజ్ అధికారికంగా ప్రకటించాడు. ఇక నేపాలీ సుందరి మనిషా కొయిరాలా అన్ని భాషల్లో తన సత్తా చాటి, 2010లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన నేపాలీ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కానీ నాలుగు నెలలకే విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. అలాగే హీరోయిన్ గౌతమి వ్యాపారవేత్త సందీప్ భాటియాను పెళ్లాడింది. 1999లో పాప కూడా పుట్టింది. ఆతర్వాత విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2005లో కమల్ హాసన్ తో సహజీవనం స్టార్ట్ చేసింది. అయితే పదేళ్లు కలిసుండి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక హీరోయిన్ అమలాపాల్ కెరీర్ ఆరంభంలోనే డైరెక్టర్ విజయ్ తో ప్రేమలో పడడమే కాదు పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఏడాదికే విడాకులు తీసుకున్నారు..

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక అక్కినేని వారసుడు హీరో సుమంత్, కీర్తిరెడ్డిని 7 ఏళ్ళు ప్రేమించి 2004లో పెళ్లిచేసుకున్నాడు. ఏడాదికే ఇద్దరు విడిపోయారు. అలాగే కొత్తబంగారు లోకం అంటూ యూత్ అందరిని మాయ చేసిన శ్వేతా బసు ప్రసాద్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహిత్ ప్రసాద్ కు ఏడాది తిరగకముందే విడాకులు ఇచ్చింది. ఇక తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుకన్య 2002లో అమెరికాలో సెటిల్ అయిన శ్రీధరన్ రాజగోపాల్ అనే వ్యక్తిని పెళ్ళాడి, సినిమాలు వదిలేసి, యుఎస్ వెళ్ళిపోయింది. కానీ ఏడాదిలోపే విడాకులు తీసుకుని ఇండియాకు వచ్చి మళ్ళి సినిమాలలో ఛాన్స్ ల కోసం ప్రయత్నించింది. ఇలా మన సినీ ఇండస్ట్రీలో చాలామంది పెళ్లిని చాలా తేలికగా తీసుకుని సంవత్సరం గడవకముందే విడిపోయారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation