ఈ ముద్దుగుమ్మల వయసెంతో తెలుసా…?

140

తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త హీరోయిన్ లతో కళకళలాడుతోంది. ఇక శతాబ్దం కాలం నుండి తెలుగు లో నిలదొక్కుకున్న అనుష్క ,కాజల్, తమన్నా, సమంతలతో పాటు కుర్ర హీరోయిన్స్ రకూల్, సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇంకా చాలా మంది తమ సినిమాలతో బిజీ అవుతున్నారు. అయితే చాలా కాలం నుండి నటిస్తున్న హీరోయిన్స్ లతో పాటు యువ హీరోయిన్స్ ల వయస్సు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for anushka
 • త్రిష : నీ మనసు నాకు తెలుసు సినిమాతో 2003 లో తెలుగు సినిమాకి పరిచయం అయింది. ఇప్పటికీ త్రిష అంటే ఆడియన్స్ లో క్రేజ్ తగ్గలేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళవుతున్నా త్రిష లుక్స్ లో ఏ మాత్రం చేంజెస్ రాలేదు. ఈ అమ్మడు వయసు 36 ఏళ్ళు.
 • అనుష్క : హీరోలతో పోటీగా లుక్స్ విషయంలో, క్యారెక్టర్స్ విషయంలో వేరియేషన్స్ మెయిన్ టైన్ చేస్తుంది ఈ బొమ్మాలి. ‘ సైజ్ జీరో ’ లాంటి సినిమాలు చేయాలన్నా అది కేవలం అనుష్క వల్లే పాసిబుల్ అవుతుంది. అల్ట్రా గ్లామరస్ క్యారెక్టర్స్ లో యూత్ ని మెస్మరైజ్ చేయాలన్నా, బాహుబలి సినిమాలో ‘దేవసేన’ లా డీ గ్లామర్ రోల్ లో కనిపించాలన్నా అది కేవలం అనుష్కకే సాధ్యం. ఈ ముద్దుగుమ్మ వయసు 37 ఏళ్ళు.
 • నయనతార : ఇండస్ట్రీలో హీరోలు ఎంత బిజీగా ఉంటారో, నయనతార కూడా అంతే బిజీగా ఉంటుంది. అంతెందుకు స్టార్ హీరోల సినిమాల కోసం ఆడియెన్స్ ఎంతగా వెయిట్ చేస్తారో, నయనతార సినిమా కోసం అంతే ఈగర్ గా వెయిట్ చేస్తారు ఆడియన్స్. 34 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం సక్సెస్ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తగా కెరిర్ ప్లాన్ చేసుకుంటుంది నయనతార.

ఈ క్రింది వీడియో చూడండి

 • కాజల్ అగర్వాల్ : తెలుగు సినిమాకి పరిచయమై 12 ఏళ్ళ కింద పరిచయం అయినా కాజల్ అగర్వాల్ ను స్క్రీన్ మీద ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. 34 ఏళ్ళ వయసులో కూడా యంగ్ గర్ల్ లుక్స్ లో ఎప్పటికపుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది ఈ పంచదార బొమ్మ.
 • సమంతా : మొదటి సినిమా ఏ మాయ చేశావే తోనే యూత్ అందరిని మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్ళైన కూడా సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. పెళ్ళైన తర్వాత కూడా గ్లామరస్ పత్రాలు చేస్తూ సినీ అభిమానులను అలరిస్తుంది. ఈ కుందనపు బొమ్మ వయసు అక్షరాలా 32 ఏళ్ళు.
తన హోయలతో షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్

 • తమన్నా : టాలీవుడ్ లో మ్యాగ్జిమమ్ హైట్స్ చూసిన హీరోయిన్స్ లో తమన్నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. గ్లామర్ కి గ్లామర్, పర్ఫామెన్స్ కి పర్ఫామెన్స్… ఓ రకంగా చెప్పాలంటే తమన్నా ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజ్. ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు వయసు 30 ఏళ్ళు.
 • రకుల్ ప్రీత్ సింగ్ : హీరోయిన్ కాస్త ప్రెట్టీ లుక్స్ లో ఉండాలి అనగానే డైరెక్టర్స్ మైండ్ లోకి వచ్చే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోయిన్స్ తో నటించి, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ వయసు 29 ఏళ్ళు.
Image result for anupama parameswaran
 • కీర్తి సురేష్ : మొదట్లో మరీ హోమ్లీగా ఉందనిపించినా కీర్తి సురేష్ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. టాలీవుడ్ లో మహానటి లాంటి గొప్ప సినిమాలో నటించి తన సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేసింది. ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయిన కీర్తి సురేష్ వయసు 26 ఏళ్ళు.
 • సాయి పల్లవి : మొదటి సినిమాతోనే హైబ్రిడ్ పిల్లగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ అయ్యింది సాయిపల్లవి. చాలా తక్కువ మంది హీరోయిన్స్ సాయి పల్లవి తరహాలో జెట్ స్పీడ్ లో ఫామ్ లోకి వస్తారు. అటు మెడిసిన్ చేస్తూనే, ఇటు సినిమాలు చేస్తున్న సాయి పల్లవి వయసు 27 ఏళ్ళు.
 • అనుపమ పరమేశ్వరన్ : కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా అనగానే కన్సిడరేషన్ లో ఖచ్చితంగా అనుపమ పేరే ఉంటుంది. ఈమె వయసు జస్ట్ 23.
 • శృతిహాసన్ : యాక్టర్.. సింగర్… ఒక్క మాటలో చెప్పాలంటే మల్టీ ట్యాలెంటెడ్. ఈ మధ్య గ్యాప్ వచ్చిందనిపించినా రవితేజ సినిమాతో మళ్ళీ ట్రాక్ పైకి రానున్న శృతి హాసన్ వయసు 33 ఏళ్ళు.
 • హన్సిక : 14 ఏళ్లకే ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 14 ఏళ్ళకే టాలీవుడ్ ని ఓ స్థాయిలో ఊపేసింది. ఈ మధ్య చిన్నగా స్పీడ్ తగ్గినా, మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తుంది. హన్సిక వయసు 28 ఏళ్ళు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation