టాలీవుడ్ హీరోలు భారీ హీరోలు… ఒక్కొక్కరు ఎంత విరాళం ఇచ్చారో చూడండి

177

నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు నుండి ఈతరం తారల వరకూ… తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ ప్రజల పక్షమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఉభయ తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన ప్రస్తుత కాలం వరకూ తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద ఏర్పడినా మేము సైతం అంటూ ప్రజలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు సహాయ సహకారాలు అందించడానికి ముందడుగు వేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా జన జీవనం స్తంభించింది. ఈ కరోనాపై యుద్ధానికి తెలుగు సినీ ప్రముఖులు తమవంతు సహాయం అందించారు. ఉదయం పవన్ కళ్యాణ్ మొదలుపెడితే… సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ వరకూ పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు. ఎవరు ఎంతెంత‌ ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం…

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

Why Tollywood Heros Takes Long Gap

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్లని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. రెండు కోట్ల రూపాయల్లో ఒక కోటి ప్రధాని సహాయనిధికి, 50 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి, 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. కోటి ఇస్తున్నట్టు తెలిపారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4 కోట్లు విరాళంగా ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. కోటి రూపాయలు, ప్రధానమంత్రి సహాయనిధికి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 75 లక్షల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 25 లక్షలు, మిగతా రూ. 25 లక్షల‌ను తెలుగు సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాని సహాయ నిధితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. 70 లక్షలను ఇస్తున్నట్టు తెలిపారు. హీరో నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసిన ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

‘దిల్’ రాజుకి చెందిన వెంకటేశ్వర క్రియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 10 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. 10 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు కొరటాల శివ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 5 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధులకు చెరో ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ‘అల్లరి’ నరేష్ & ‘నాంది’ నిర్మాత సతీష్ వేగేశ్న రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దర్శకుడు వీవీ వినాయక్ ‘మనం సైతం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ కు రూ. 5 లక్షలు ఇచ్చారు. పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేయమని కోరారు. రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200మంది నిరుపేద కళాకారులకు రాజశేఖర్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మరో రెండు వందల మందికి త్వరలో అందజేయనున్నట్టు తెలిపారు. ఇలా చెప్పుకుంటూపోతే సినీ ఇండస్ట్రీ నుంచి భారీ విరాళాలు అందజేశారు. ఏది ఏమైనా ప్రజలు కష్ట కాలంలో ఉన్నప్పుడు ఇలా సహాయం చెయ్యడానికి ముందుకు రావడం సంతోషించే విషయమే..

Content above bottom navigation