టాలీవుడ్‌లో విషాదం ప్రముఖ దర్శకుడు మృతి కుప్ప కూలిన చిరు

103

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు చిత్రానికి దర్శకుడిగా చేశారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్ కుమార్ అంత్యక్రియలను అక్కడే నిర్వహించనున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లుకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు..ఆసినిమా ఎంతో హిట్ అయింది, ఆయ‌న‌కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది..అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్రం విడుదల అప్పట్లో ఆలస్యమైంది.. ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇక ఆ సినిమాకు ఆయన ఐదు నంది అవార్డులను సొంతం చేసుకొని అప్పట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచారు. ఆ తరువాత మా శ్రీమల్లి అనే చిత్రాన్ని మాత్రమే తీసిన రాజ్ కుమార్.. అప్పటి నుంచే టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వచ్చిన సంద‌ర్బంలో స్పందించిన మెగాస్టార్.. రాజ్‌ కుమార్‌కు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమారులు ఉండగా.. భార్య, పెద్ద కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్నారు. సంపాదన కూడా లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీశారు..కుటుంబసభ్యులు. రాజ్ కుమార్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు అని ఆయ‌న ఆరోగ్యం బాగాలేదు అని చిరంజీవికి తెలియ‌డంతో వెంట‌నే ఆయ‌న స్పందించారట‌. అపోలోకి తీసుకువ‌చ్చి ఆయ‌న‌కు చికిత్స అందించారు.. ఉచితంగా ప‌రీక్ష‌లు చేయించారు, ఉచితంగా మెడిస‌న్ అందించారు.. కొంత ఆర్దిక సాయం కూడా చేశారు, ఇలా ఆయ‌న కొలుకుంటున్నారు అనుకున్న స‌మ‌యంలో. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న శనివారం ఉదయం మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు కు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల చిరంజీవి సంతాపం ప్ర‌క‌టించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation