కుక్క బిస్కెట్లు తింటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

సినిమా మూవీ ఫంక్ష‌న్ల స‌మ‌యంలో న‌టీన‌టుల గురించి కొన్ని విష‌య‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయి.. ఇక వారి సీక్రెట్స్ కూడా ఈ స‌మ‌యంలో బ‌య‌ట‌కు రివీల్ అవుతాయి.. అలాగే వారు ఖాళీగా ఉండే స‌మ‌యంలో షూటింగ్ గ్యాప్ వ‌చ్చిన స‌మ‌యంలో ఏం చేస్తారు అనే విష‌యాలు కూడా హీరోలు హీరోయిన్లు మీడియాల‌తో పంచుకుంటారు.. తాజాగా హీరో ర‌ష్మిక మంద‌నా గురించి హీరో నితిన్ ఓ సీక్రెట బ‌య‌ట‌పెట్టాడు.టాలీవుడ్ లో ఛలో సినిమాతో సక్సెస్ అయిన హీరోయిన్ రష్మిక మందనా.. విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో టాలీవుడ్ మోస్ట్ క్రేజీయస్ట్ హీరోయిన్ గా మారి ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా సినిమా చేసేసింది. ఇప్పుడు బన్నీ సినిమాలో ఛాన్స్ కొట్టిసింది. ప్రస్తుతం నితిన్ తో భీష్మచిత్రంలో న‌టించింది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నితిన్–రష్మిక. అయితే.. ఈ ఇంటర్వ్యూల్లో రష్మిక గురించి నితిన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

Image result for hero nithin and rashimka

రష్మిక ఆకలేసినప్పుడు కుక్క బిస్కెట్లు తింటుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘సాధారణంగా మనకు ఆకలేసినప్పుడు స్నాక్స్ టైమ్ లో స్వీట్లు, చిప్స్.. వంటివి తింటూంటాం. కానీ ఈ అమ్మాయి ఏం తింటుందో తెలుసా.. ‘కుక్క బిస్కట్లు’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. దీంతో అవాక్కయిన రష్మిక.. ‘వద్దు వద్దు.. చెప్పొద్దు’ అనటం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.. హమ్మయ్య.. ఈ సినిమాలో లిప్ కిస్ లు ఏమీ లేవు అని నితిన్ అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంటర్వ్యూ సరదాగా సాగినట్టు తెలుస్తున్నా రష్మిక గురించి నితిన్ ఇలా ఓపెన్ గా చెప్పడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇందులో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. ‘అందుకే అంత క్యూట్ గా ఉంది.., పిడిగ్రీ స్మెల్ కి టెంప్ట్ అయినట్టుంది..,అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రి పూర్తిగా ఫుల్ వీడియోలో ఏముందో చూడాలి .., సినిమా ప్రమోషన్ కోసం ఇదంతా అని మ‌రికొంద‌రు అంటున్నారు… ఛలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ ఈనెల 21న విడుదలవుతోంది. మొత్తానికి ఈ కుక్క బిస్కెట్ల గురించి ర‌ష్మిక ఏమైనా క్లారిటీ ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation