సినీ ఇండస్ట్రీ లో ఘోర విషాదం టాలీవుడ్ యువ దర్శకుడు మృతి

1443

ఎన్నో ఏళ్ల శ్రమ.. సహాయ దర్శకుడిగా మొదలైన అతని ప్రయాణం వెండితెర మీద దర్శకుడిగా తన పేరు చూసుకోవాలని తపించాడు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు.. క్రియేటివిటీకి పదును పెట్టే క్రమంలో కథలను వార్చి వండాడు. ట్రెండ్ సెట్ చేయాలనే ఉద్దేశంతో మంచి కథ రాసుకున్నాడు. చక్కగా దర్శకత్వం వహించాడు. కానీ, తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాను చూడకుండానే అతను మరణించాడు.

యువ దర్శకుడి మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గతేడాది శర్వానంద్ హీరోగా వచ్చిన ‘రణరంగం’ సినిమాకు ప్రవీణ్, సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ నేపథ్యంలో అతని పనితనం మెచ్చిన అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో ఓ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. దీంతో తన సినిమా పనులతోనే బిజీ అయిపోయాడు ప్రవీణ్.

కరోనా రోజులను దాటుకుని వరుస షూటింగులు చేసుకుంటూ చివరి దశకు వచ్చేశారు. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా అందులో కార్ నడపాల్సిన సన్నివేశం ఒకటి ఉంది. అందులో కారును తాను నడిపి చూపిస్తానని చెప్పాడు. ప్రవీణ్ కారు డ్రైవింగ్ చేస్తుండగా అనుకోకుండా ఆ కార్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స పొందుతూ అక్టోబర్ 9న పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation