ఆసుపత్రిలో చేరిన ప్రముఖ కమెడియన్…పరిస్థితి తెలిసి షాక్ లో సినీ పరిశ్రమ

87

ఈ మధ్య సినిమా రంగంలో ఎప్పుడు ఎవరికేమి అవుతుందో తెలియ‌డం లేదు, పైకి అంతా ఆరోగ్యంగా ఉన్నా స‌రే కొంద‌రు హ‌ఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు, టాలీవుడ్ లోనే కాదు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి విషాద సంఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య జ‌రుగుతున్నాయి.అందుకే ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని అందరూ కంగారుపడుతున్నారు. తాజాగా గౌండమని ఆరోగ్య పరిస్థితి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఈ వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియాలో 310కి పైగా సినిమాల్లో నటించి ఆడియన్స్ ని ఆనందపరిచిన ఆయ‌న‌ ఆరోగ్యం ఇప్పుడు విషంగా ఉందట. ఆయ‌న‌ వయస్సు 80ఏళ్ళు. ఆయ‌న చేసిన సినిమాలు అన్నీ ఆల్ టైం హిట్.. దాదాపు 250 హిట్ చిత్రాలు ఆయ‌నకు అవార్డులు తెచ్చిపెట్టాయి..

Image result for Goundamani

కోయంబత్తూరు దగ్గర వాళ్ళకుందాపురం అనేగ్రామంలో జన్మించిన గౌండమని కి భార్య శాంత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మరో కమెడియన్ సెంథిల్ తో కలిసి చాలా ఏళ్లుగా గౌండమని జనాన్ని పంచ్ డైలాగులతో నవ్వించాడు. వీరిద్దరిదీ సూపర్ హిట్ కామెడీ స్టార్స్ గా పేరు మారుమోగింది. నిజానికి ఈయ‌న పేరు సుబ్రహ్మణ్యన్ కరుప్పియా. డ్రామాల్లో నటించడం వలన గౌండమనిగా పేరొచ్చింది. 16సంవత్సరాల వయస్సు నుంచి డ్రామాల్లో నటిస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ ఆయ‌న స‌ద్వినియోగం చేసుకున్నారు..

ఈ క్రింది వీడియోని చూడండి

సినిమాల్లో 1980నుంచి 2000వరకు గౌండమని హవా కొనసాగింది. అయితే ఆరోగ్యం దెబ్బతినడంతో గత పదేళ్లలో నాలుగే నాలుగు చిత్రాలు చేసారు. ఇక నాలుగైదేళ్లుగా పరిస్థితి మరింత విషమించింది. పూర్తిగా బక్కచిక్కి గుర్తుపట్టేందుకు వీలులేకుండా మారిపోయారు. ఇక కొన్నాళ్ల క్రితం హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో చికిత్స కూడా పొందార‌ట. ఇప్పుడు కాలేయం,కిడ్నీ సమస్యలకు మరో హాస్పిటల్ లో వైద్యం చేస్తున్నారట. అయితే గౌండమని ఆరోగ్యంగానే ఉన్నాడని,పుకార్లను నమ్మవద్దని త్వరలో ఓ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వినివస్తున్నాయి. నిజానికి ఓ ఫంక్షన్ లో ఆయ‌న‌ని చూసిన ఫాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారట. కాని ఆయ‌న ఆరోగ్యం గ‌తంలో ఉన్నంత బాగాలేదు అని చిత్ర ప‌రిశ్ర‌మ సీనియ‌ర్ న‌టులు కూడా అంటున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి:

Content above bottom navigation