కృష్ణం రాజు కూతుర్లు ఏం చేస్తునారో తెలుసా ?

105

ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన భార్య శ్యామలాదేవి. వీరికి ముగ్గురు కుమార్తెలు.. ప్రసీద,ప్రకీర్తి,ప్రదీప్తి. ఎలాంటి సందర్భాంలోనైన భయపడకుండా ధైర్యంగా ఉండాలని కూతుళ్ళకు కృష్ణంరాజు చెబుతుటారట. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ కూతుళ్లు ముగ్గురూ చదువులో బెస్ట్ అనిపించుకున్నారని ఆయన అంటారు.డొనేషన్స్ లేకుండా మెరిట్ లో సీట్లు తెచ్చుకున్నారని.. సొంత కాళ్లపై నిలబడే మనస్తత్వం అని కృష్ణం రాజు చెప్పారు. పెద్దకూతురు సాయి ప్రసీద మెరిట్ మీద లండన్ లో మెడిసిన్ సీటు సంపాదించుకుంది. లాస్ ఏంజిల్స్ లో ప్రస్తుతం ప్రొడక్షన్ కోర్సు చేస్తున్న ఈమె ప్రొడక్షన్ విభాగంలోకి రావాలని అనుకుంటోంది. రెండో కుమార్తె సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్శంటేజ్ రావడంతో జె ఎన్ టి యు లో సీటొచ్చింది. పెయింటింగ్ పై మంచి పట్టుకల్గి బొమ్మలు బాగా గీస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రతియేటా ప్రభాస్ బర్తడే కి అందమైన ప్రభాస్ బొమ్మను కూడా గీసి ఇస్తుందని కృష్ణంరాజు ఓ ఇంటర్యూలో చెప్పారు. ఇక మూడో కుమార్తె సాయి ప్రదీప్తి సైకాలజీ కోర్స్ చేస్తోంది. మెరిట్ లో సీటు సంపాధించి చదువుకుంటుంది. డొనేషన్ కట్టి చదివిస్తా అని చెప్పినా వినకుండా సొంత గా మెరిట్ లో సీటు సంపాధించి చదువుకుంటుందని కృష్ణంరాజు గర్వంగా చెప్పుకొచ్చారు. గౌరవంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని.. తన పిల్లలు కూడా అదే దారిలో వెళ్తున్నారని ఆయన అన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation