నితిన్‌ కు కాబోయే భార్య షాలినీ ఎవరి కూతురో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో యంగ్ హీరో నితిన్ ఒకడు. నూనూగు మీసాల వయసులోనే నితిన్ జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌తో హిట్ కొట్టి టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇష్క్’ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఇక త్వ‌ర‌లోనే హీరో నితిన్‌ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ నిశ్చితార్థం షాలినితో ఫిబ్రవరి 15న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రింది వీడియోని చూడండి

శనివారం హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘పెళ్లిపనులు ఆరంభం.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’’.. అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. అయితే నితిన్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు, ఆమె వివరాలు ఏంటనేది ఎవరికీ తెలీదు. నితిన్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరా అని అతని ఫాన్స్ తెగ అతృతతో ఎదురుచూస్తున్నారు. ఆమెకు సంబందించిన విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి. నితిన్ ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని. వీళ్ళ సొంత ఊరు నాగర్ కర్నూల్. ఈమె నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెండు దశాబ్దాలుగా ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ను నిర్వహిస్తున్న డా.సంపత్‌ కుమార్‌, నూర్జహాన్‌ల రెండవ కుమార్తె.

Image result for nithin engagement

నితిన్ షాలినిని 2012లోనే కలిసారట. అయితే అప్పటికి ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. రెండేళ్ల క్రితమే ఇద్దరి స్నేహం ప్రేమగా మారిందట. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటుండడంతో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే ఇద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా? నితినే ముందు ప్రపోజ్ చేశాడంట. ఒంటికాలిపై నిలబడి ప్రపోజ్ చేసాడట. దాంతో నితిన్ చేష్టలు చూసి నవ్వుకున్న షాలిని వెంటనే అతని ప్రేమను ఒప్పుకున్నారట. మరో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు నితిన్ నటించిన అన్ని సినిమాలు షాలిని చూసేసిందట. సినిమా చూసాక తన అభిప్రాయాలను నిజాయతీగా చెబుతుందట. నితిన్ బాధపడతాడు అనుకోకుండా తనకు అనిపించింది ఉన్నది ఉన్నట్లు చెబుతుందట. అయితే నితిన్ నటించిన ‘లై’ సినిమా మాత్రం షాలిని అర్థం కాలేదట. ఈ విషయాన్ని నితిన్‌ కి చెబితే అతను నవ్వి ఊరుకున్నాడట. ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌ లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 21న హైటెక్‌ లో నితిన్‌ వివాహ రిసెప్షన్‌ ను ఏర్పాటు చేయనున్నరని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజీకయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation