అందరిని నవ్వించే సుధీర్ జీవితంలో జరిగిన విషాదం తెలిస్తే ఎవరైన కన్నీళ్లు పెట్టుకుంటారు

107

జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరికీ పరిచయం అయిన సుడిగాలి సుధీర్… తన స్కిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు పెద్ద పెద్ద షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి పొజిషన్‌కు వచ్చాడు. అయితే సుధీర్ ఈ స్థాయికి రావడం వెనక ఎంత కష్టపడ్డాడు? అతడి జర్నీ ఎక్కడ మొదలైంది? అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధీర్ ఈ విషయాలు వెల్లడించారు. మరి సుదీర్ చెప్పిన ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for sudher

16 ఏళ్ల వయసులో సినిమాల్లో ట్రై చేద్దామని హైదరాబాద్ వచ్చాను. కానీకుదరలేదు. వాళ్లు డబ్బులు అడిగితే ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేవు. సపోర్ట్ కూడా లేదు. ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చేశాను.ఇంటర్ మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఎగ్జామ్స్ రాయడానికి సంవత్సరం వెయిట్ చేయాలి. ఈ లోపు ఏదో ఒకటి చేద్దామనుకునే లోపు మా నాన్నకు యాక్సిడెంట్ అయింది. కాలుకు ఫ్చాక్చర్ అయింది. రాడ్ వేశారు. ఆయన షుగర్ పేషెంట్ కావడంతో మా అందరిలో భయం. నేను 17 ఏళ్ల పిల్లోడిని. డాడీ ఆరు నెలలు బెడ్ మీద ఉన్నారు. ఏదైనా చేయాలన్నా ఎవరికీ ఏమీ రాదు. అపుడు నేను పెద్ద కొడుకుగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. మా డాడీ కూడా నన్ను హైదరాబాద్ పంపించేపుడు ఏడ్చేశారు. ఈ వయసులో నీకు ఏదైనా చేయడానికి తండ్రి హెల్ప్ ఉండాలి. కానీ నువ్వు తండ్రి లాగా నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు అని బాధ పడ్డారు. ఇంటి నుంచి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు సంవత్సరాలు జాబ్ చేశాను. నేను అక్కడ మెజీషినయ్ గా పని చేసేవాడిని. 5వ తరగతి నుంచే నేను మామయ్య దగ్గర మ్యాజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. అది ఎంతో హెల్ప్ అయింది. రూ. 8 వేల జీతంతో ఫిల్మ్ సిటీలో నా జీవితం మొదలైంది. రూ. 500 ఉంచుకుని మిగతా డబ్బు ఇంటికి పంపేవాడిని. అక్కడే ఫుడ్, బెడ్… ఖర్చు కూడా ఏమీ ఉండేది కాదు. ఎప్పుడైనా డాడీ వాళ్లతో మాట్లాడటానికి, ఇంటర్నెట్ కు మాత్రమే డబ్బులు ఖర్చయ్యేవి. రెండు సంవత్సరాలు బానే ఉంది కానీ ఎప్పుడూ పేరెంట్స్ ను వదిలి ఉండలేదు.

Image result for sudigali sudheer

అక్కడ ప్రతి రోజూ జాబ్ చేయాలి. ఒక్క రోజు కూడా వీకాఫ్ ఉండదు. రామోజీ ఫిల్మ్ సిటీ 365 రోజులు ఓపెన్ ఉంటుంది. జనాలు వస్తుంటారు.. పోతూ ఉంటారు. ఆదివారం కూడా సెలవు ఉండదు. రెండు సంవత్సరాలు పేరెంట్స్ ను వదిలేసి కష్టపడ్డాను. నాకు ఫిల్మ్ సిటీనే లోకం అయిపోయింది. అలాంటి సమయంలోనే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసి పోయింది. ఇది నా జీవితంలో పెను విషాదాన్ని తీసుకొచ్చింది. చాలా రోజులు ఆ బాధ నుంచి బయటపడలేదు. అయితే ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో జాబ్ కంటిన్యూ చెయ్యాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత నా సాలరీ 30 వేలు అయింది. నాకు అదే లైఫ్ అయిపోయింది. దానికి మించి చూడలేక పోతున్నాను అనే ఫీలింగ్ ఎక్కువైంది. డబ్బులు వస్తున్నాయి కానీ సూపరేం కాదు. ఇంట్లో వాళ్లు తినడానికి, ఇతర ఖర్చులకు, నాకు సరిపోతున్నాయి. సేవింగ్స్ అయితే ఉండటం లేదు. ఇక్కడి నుంచి బయటకు వచ్చి సొంతగా మ్యాజిక్ షోలు మొదలు పెడదామనుకున్నాను. జాబ్ మనేసిన తర్వాత విపరీతంగా కష్టపడ్డాను.

ఈ క్రింది వీడియోని చూడండి

రెండు మూడేళ్లు నా కష్టాలు ఎవరితో చెప్పుకోలేనంత భీభత్సంగా ఉండేవి. ఎస్ఆర్ నగర్ లో ఫ్రెండ్స్ తో ఉండే వాడిని. అక్కడ ఓ మెజీషియన్ దగ్గర చేసేవాడిని. ఒక్కోసారి ప్రోగ్రామ్స్ ఉండేవి, ఒక్కో నెల ఉండేవి కావు. కొన్ని సార్లు వాటర్ కొనుక్కోవడానికి డబ్బుల్లేక సింక్ లో వచ్చే నీళ్లు తాగే వాడిని. ప్రియా పికిల్స్ ప్యాకెట్ తెచ్చుకుని పచ్చడి తినేవాడిని. చిన్నప్పటి నుంచి నేను అలా పెరగలేదు కాబట్టి కష్టం అనిపించింది. ఒక్కోసారి ఏడుపొచ్చేది. అలాంటి కష్టాలు పడ్డ తర్వాత షోలు పెరగడం, యాంకరింగ్ మొదలు పెట్టడం, ఈవెంట్స్ చేయడం ఆ తర్వాత నుంచి లైఫ్ మారిపోయింది. గత రమూడు సంవత్సరాల నుంచి అయితే నా జీవితం సూపర్ గా ఉంది. ఫైనల్ గా దేవుడు బ్లెస్ చేసి సక్సెస్ ఇచ్చాడు. జబర్దస్త్‌లో చేయడం వల్ల సినిమా వాళ్ల పిలిచి అవకాశాలు ఇస్తున్నారు అని సుడిగాలి సుధీర్ తాను పడ్డ కష్టాలను తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation