ఒకప్పుడు పాపులర్ నటి… ఇప్పుడు రోడ్డు ప్రక్కన దోశలు వేస్తుంది. ఏమైందో తెలిస్తే కన్నీళ్లే…

సినిమా రంగం ఒక కలల ప్రపంచం. ఒక్క సినిమా హిట్ అయితే చాలు క్రేజ్ డబ్బు వస్తాయి. సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు వస్తుంది. అందుకే ఈ సినీ వినీలాకాశంలో విహరించాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నో రోజులు తిరుగుతూనే ఉంటారు. కానీ అదృష్టం ఉన్న వారికే వస్తుంది. అయితే అలా అదృష్టం వచ్చి నటించినా కూడా వారి జీవితం మొత్తం తారుమారు ఏమి అయిపోదు. వారికి కూడా కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని సినిమావాళ్లు చాలా చక్కగా వంటపట్టించుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఉన్న అవకాశాలు రేపు ఉంటాయో ఉండవో అనే భయంతో. అయితే అలాంటి ఆలోచన లేకుండా దొరికిన పాత్రలు చేస్తూ పోతూ, ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోని ఒక నటి ఇప్పుడు అవకాశాలు లేక దోశలు అమ్ముకుంటుంది.

మళయాళంలో ఫేమస్ సీరియల్ ఆర్టిస్టు ఈ కవిత. ఈమె కొన్ని సినిమాలలో కూడా నటించింది. స్త్రీ ధనం అనే సీరియల్లో నెగటివ్ రోల్ పోషిస్తున్న ఈమె నటనకు మళయాలం చాలా మంది అభిమానులున్నారు. ఇప్పుడు ఈమె చేస్తున్న పని వల్ల దేశమంతా అభిమానులు తయారవుతున్నారు. ఎందుకంటే ఆత్మాభిమానాన్ని నమ్ముకుని, నామోషి లేకుండా కష్టపడి జీవించే వారిని ఎవరు మాత్రం అభిమానించకుండా ఉంటారు. అందుకే ఈమె కష్టాన్ని అర్దం చేసుకుని దర్శకులు కూడా మార్నింగ్ టు ఈవెనింగ్ షూట్స్ పెట్టుకుంటున్నారు. షూటింగ్ అయిపోగానే సరాసరి హైవే పక్కనున్న దోశల బండి దగ్గరకు వెళ్లి అక్కడ పని చేసుకుంటుంది. కవితకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురే తల్లికి ఈ పనిలో సాయం చేస్తుంటుంది. ఈమె ఇంత కష్టపడుతుంటే మరి భర్త ఏమయినట్టు అనే కదా మీ అనుమానం. పదమూడేండ్ల క్రితమే భర్త నుండి విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లల బాద్యతను భుజాన వేసుకుంది. పిల్లల కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతుంది.

Image result for malayalam kavitha lakshmi

ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటుంది. కవితను ఈ పనెందుకు చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే….ఇంతకముందు నా పిల్లలకు చేసి పెట్టేదానిని, ఇప్పుడు నా పిల్లల చదువు కోసం పదిమందికి చేస్తున్నా. నాకు విలాసవంతమైన జీవితం కన్నా నా పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడటం ముఖ్యం. నాకంటూ భూమి, ఇల్లు లేవు అమ్మి డబ్బు తెచ్చుకోవడానికి. చిట్టి వేస్తున్నా అవి ఇప్పట్లో రావు. అందుకే ఈ మార్గం ఎంచుకున్నా. ఇదేం తప్పు పని కాదు కదా అని సూటిగా ప్రశ్నిస్తుంది. సినిమా తారలు గానీ, టీవి సెలబ్రిటీలు గానీ నటన కాకుండా చేసే వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయా అంటే టక్కున గుర్తొచ్చేది ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ లాంటివి. కొందరు అవకాశాలు లేక అవసరాల కోసం, సకల సౌకర్యాల కోసం, లగ్జరీ లైఫ్ కోసం వ్యభిచారంలోకి దిగిన వారు కూడా ఉన్నారు. వారందరికీ భిన్నంగా ఉన్న ఈ కవితలక్ష్మీ నిజంగా గ్రేట్ కదా..

Content above bottom navigation