అర్జున్ రెడ్డి హీరోయిన్ గురించి షాకింగ్ నిజాలు

హీరోయిన్ షాలినీ పాండే గురించి మాట్లాడుకోవాలంటే ‘అర్జున్ రెడ్డి’కి ముందు.. ఆ తర్వాతే అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ దక్కించుకున్నాడు. మరోవైపు షాలినీ పాండే అదే రేంజ్‌లో పాపులారిటీ రాకపోయినా ఓ మోస్తరు గుర్తింపు మాత్రం తెచ్చుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో షాలినీ పాండే చేసిన ముద్దు సన్నివేశాలు అప్పట్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసాయి. ఆ సినిమా తర్వాత అడపదడపా కొన్ని సినిమాలు చేసినా, పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించింది మాత్రం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’. అయితే ఈ అమ్మడు ఇంత స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడిందంట. ఒకసారి మీడియాతో మాట్లాడుతూ తానూ పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది షాలిని.

Image result for shalini pandey

మధ్యప్రదేశ్‌ లోని జబల్ పూర్ సిటీకి చెందిన ఒక గవర్నమెంట్ ఉద్యోగి కూతురు షాలిని. ఇంజనీరింగ్ చదివే సమయంలో చదువు మధ్యలోనే ఆపి సినిమా రంగంలోకి వెళ్ళాలని భావించింది షాలిని. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చదువును పూర్తి చేసింది. అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. నటనలో ప్రతిభ చూపడంతో ముందు నటించడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో గాని సినిమాలలోకి వద్దని చెప్పేశారు. అయినా కూడా తండ్రితో విభేదించింది. చివరికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించేసుకుంది షాలిని. ముంబైలో స్నేహితురాలి ఇంటికి వెళ్ళివస్తానని చెప్పి బయటకు వచ్చిన షాలిని, తర్వాత ఇంటికి వెళ్ళలేదు. నన్ను సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటేనే ఇంటికి వస్తానని చెప్పినా కూడా, షాలిని తండ్రి ఒప్పుకోలేదు. ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో షాలిని తాను మేజర్‌ ను, తనను బలవంతంగా తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే కేసు పెడతానంటూ హెచ్చరించింది. దీంతో తండ్రి, నువ్వు ఇంటికెప్పుడూ రావద్దంటూ వెళ్ళిపోయారు. అయినా సినిమా ఛాన్సుల కోసం షాలిని రకరకాల ప్రయత్నాలు చేసింది.

ఈ క్రింది వీడియోని చూడండి

డబ్బులు లేకపోవడంతో చిన్న గదిలో అద్దెకు ఉంటూ, తినడానికి తిండి కూడా లేని దీనస్థితిలోకి వెళ్ళిపోయిందట షాలిని. డబ్బులు మిగుల్చుకోడానికి సినిమా ఆఫీసుల వద్దకు నడిచివెళ్ళేదంట. కొన్నిసార్లు డబ్బులు లేక భోజనం కూడా చెయ్యలేదంట. అప్పుడే అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం లభించిందట. సినిమా షూటింగ్‌ కు రెండు నెలల సమయం ఉందట. అప్పటికే షాలిని దగ్గరున్న డబ్బులు అయిపోయాయట. దాంతో ఏమి చెయ్యాలో తెలియక, దాదాపు రెండు నెలల పాటు తనకు తెలిసిన ఇద్దరబ్బాయిలతో ఒకే గదిలో కలిసి ఉందట. అలా ఎన్నో బాధలు పడి చివరకు అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ విషయాలన్నీ స్వయానా షాలినినే మీడియాతో చెప్పింది. నాకు సహాయం చేసిన ఫ్రెండ్స్ సహాయాన్ని ఎప్పటికి మర్చిపోలేనని, నా అన్నవాళ్ళు ఎవరు లేని సమయంలో నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు. వారిని నా జీవితాంతం గుర్తుంచుకుంటా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. మొదటి సినిమాతోనే తన నటనతో అందరిని మెప్పించిన షాలినికి తర్వాత కొన్ని పెద్ద ప్రాజెక్ట్ లు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా ఆమెకు స్టార్ట్ డమ్ ను తీసుకురాలేకపోయాయి. షాలినికి మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చి స్టార్ హీరోయిన్ అవ్వాలని, అలాగే షాలిని తల్లిదండ్రుల మనస్సు మారి, తనను ఎప్పటికైనా ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation