త్రివిక్రమ్ లవ్ స్టోరీ అక్క కోసం వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకున్నాడు

202

అప్పటివరకు మూసధోరణిలో వెళ్తున్న సినిమా సంభాషణలకి కొత్త రూట్ చూపించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తేలికైన పదాలతో, చాలా అర్ధవంతమైన సంభాషణలు చెప్పడం ఆయన స్పెషాలిటీ.. స్వయంవరం సినిమాతో మాటల రచయితగా సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. చేసినవి కొద్ది సినిమాలే అయినప్పటికీ టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు. అయితే త్రివిక్రమ్ సినీ కెరీర్ గురించి తెలిసినంతగా అతని కుటుంబం గురించి ఎవరికీ తెలియదు.

Image result for trivikram and wife

విక్రమ్ భార్య పేరు సౌజన్య.. ఆమె మంచి నృత్యకళాకారిణి.. ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు.. అయితే వీరి పెళ్లి కూడా ఓ సినిమాని తలపించే స్టొరీలాగే ఉంటుంది. త్రివిక్రమ్ సౌజన్య వాళ్ళ అక్కని చూసేందుకు పెళ్లి చూపులకి వెళ్ళాడట! కానీ అక్కడ పక్కనే ఉన్న సౌజన్యని చూసి ఇష్టపడ్డాడట! అక్కడే తన మనసులో మాటను చెప్పేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడట! మంచి సంబంధం, సీతారామశాస్త్రికి బాగా నచ్చిన వ్యక్తి, ఎలాంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి కావడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట! కానీ పెద్ద అమ్మాయి పెళ్లి అయ్యాకే ఈ పెళ్లికి ఒకే అని చెప్పారట! ఇలా సంవత్సరం తర్వాత త్రివిక్రమ్ సౌజన్యని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

తాజాగా త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అల వైకుంటపురములో అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలిజై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇక ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే చిత్రం వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఈ కాంబినేషన్ రీపీట్ అవుతుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation