ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు పేరు చెబితే తెలియని వారుండరు. నటుడిగా విశ్వ విఖ్యాతమై,రాజకీయాల్లో ప్రభంజనమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం. ఎన్టీఆర్, బసవతారకంలకు 12మంది సంతానం కాగా, వారి పిల్లలను లెక్కేస్తే దాదాపు 20 మంది వరకూ ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ మూడో తరంలో అందుబాటులో గల మనవలు, మనవరాళ్లు కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నారు. అయితే పెద్ద కొడుకు జయకృష్ణ కూతురు కుమిదిని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.. మరి ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటి. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నందమూరి జయకృష్ణ కూతురు పేరు కుమిదిని. ఈమెకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తితో 1993 లో పెళ్లి చేశారు. అతని పేరు శ్రీనాథ్. కొన్నేళ్లు వారి సంసారం బాగానే సాగింది. అయితే ఒక సమయంలో శ్రీనాథ్ వ్యాపారం కోసం కుముదినిని 1 మిలియన్ డాలర్స్ డిమాండ్ చేశాడు.ఆ తర్వాత కుముదిని ఇండియాకు వచ్చింది. అయితే రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అన్ని సద్దుమణిగి 1998 లో కుముదిని శ్రీనాథ్ కోసం అమెరికాకు వెళ్ళింది. కానీ ఆమె అక్కడికి వెళ్లేసరికి శ్రీనాథ్ మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆ ఘటనను చుసిన కుముదిని వెంటనే ఇండియాకు వచ్చేసి చెన్నైలో ఉన్న అత్తవారింటికి వెళ్ళింది. పుట్టింటికి రాకుండా అత్తవారింట్లోనే ఉండి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ జీవించేది.
ఈ క్రింది వీడియో చుడండి
అయితే శ్రీనాథ్ కు కుముదినికి మధ్య గొడవలు తీవ్రస్థాయిలోకి వెళ్లడం, శ్రీనాథ్ కుముదినితో పూర్తీగా బంధాన్ని తెంచుకోవాలనుకోవడంతో 1999 డిసెంబర్ లో కుముదిని మొదటిసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ అప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడింది. అప్పుడైనా తన భర్తలో మార్పు వస్తుందేమో అని అనుకుంది. భర్త ఎన్ని తప్పులు చేసినా, ఇద్దరు పిల్లలతో కలిసి బతకడానికి ప్రయత్నించింది. కానీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అక్టోబర్ 29 2000 సంవత్సరంలో ఉరిపోసుకుని చనిపోయింది. కుముదిని మరణం అప్పట్లో సంచలనం రేపింది. కుముదిని చనిపోవడానికి శ్రీనాథ్ కారణమని మహిళా కోర్ట్ అతనికి పదేళ్లు జైలు శిక్ష వేసింది. దాంతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. పిల్లల భాద్యతను కుమిదిని తండ్రి జయకృష్ణకు అప్పగించింది. ఇలా మనకు తెలియని ఎన్టీఆర్ మనువరాలి జీవితం అర్దాంతరంగా ముగిసిపోయింది.