బ్రేకింగ్ : వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఆందోళనలో ఫ్యాన్స్

145

విజయ్ దేవరకొండ…టాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న హీరో. అర్జున్ రెడ్డి చిత్రంతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తన ఫాన్స్ కు రౌడీ బ్యాచ్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ మధ్య విజయ్ కెరీర్ గాడి తప్పింది. వరుస ప్లాప్స్ పలకరిస్తున్నాయి. అందుకే విజయ్ ఇప్పుడు ఒక సెన్సేషన్ డెసిషన్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. కెరీర్ ఆరంభంలో హిట్లు కొట్టినా.. గత ఏడాది వచ్చిన ‘ డియర్ కామ్రేడ్ ‘ తో పాటు ఇటీవల విడుదలైన ‘ వరల్డ్ ఫేమస్ లవర్ ‘ మూవీ బాక్సీఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో అతడి కెరీర్‌ ఇబ్బందికరంగా మారింది. వరుస ఫ్లాపులతో రౌడీ స్టార్ ఫ్యాన్స్‌ కూడా నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం విజయ్ సంతకం చేసిన సినిమాల్లో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ మాత్రమే ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్ హిట్ తర్వాత పూరీ రూపొందిస్తున్న చిత్రం కావడంతో విజయ్‌ తో పాటు ఆయన అభిమానులు ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని పూరీతో పాటు చార్మీ, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు మొదట ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకున్నారు. అంతేకాదు, దీన్ని తెలుగులో మాత్రమే తీయాలని భావించారు. కానీ కరణ్ జోహర్ ఈ స్క్రిప్టును చూసిన తర్వాత దీన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని నిర్ణయించారు. దీంతో సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అలాగే టైటిల్‌ను కూడా ‘లైగర్’ అని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Image result for vijay devarakonda puri jagannath

విజయ్ ఆశలన్నీ కూడా ఈ సినిమా మీదనే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్, ఆలియా భట్, కియారా అద్వాణి సహా ఎంతో మంది బాలీవుడ్ నటీమణుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటీవల ఇందులో నటించే హీరోయిన్‌గా అనన్య పాండేను ఫైనల్ చేయడంతో పాటు ప్రేక్షకులను ఆమెను పరిచయం చేశారు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ తాజాగా సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం… ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ రిలీజ్ అయ్యే వరకు విజయ్ మరో సినిమాలో నటించడనేదే ఆ వార్త సారాంశం. దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ పెట్టిన కండీషన్ల వల్లే విజయ్ దేవరకొండ ఈ నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Image result for vijay devarakonda puri jagannath

ప్రస్తుతం విజయ్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా అతనికి కలిసి రావడం లేదు. మంచి కథలు ఎంచుకున్నా కూడా ప్లాప్స్ వస్తున్నాయి. దీనికి కారణం విజయ్ ఒకేసారి రెండుమూడు సినిమాలలో నటించడమే అని కరణ్ జోహార్ కూడా అనుకుంటున్నాడు. అందుకే విజయ్ వేరే సినిమా ఒప్పుకుంటే ‘లైగర్’ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేడన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఈ కండీషన్ పెట్టారని అంటున్నారు. హిట్ కోసం పరితపిస్తున్న విజయ్ ఈ కండిషన్ కు ఒప్పుకోలేక తప్పలేదని ఫిలిం నగర్ నుంచి వినిపిస్తున్న మాట..

Content above bottom navigation