సెలబ్రెటీలకు చెందిన ప్రతి విషయం కూడా జనాల్లో ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. వారు ఏం చేసినా, వారికి ఏం జరిగినా కూడా అంతా కూడా తెలుసుకునేందుకు ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. అలాగే వాళ్లకు ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా అభిమానులు తట్టుకోలేరు. తాజాగా విజయ్ దేవరకొండ చిన్న ప్రమాదం జరిగింది. ముంబయిలో షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో కాలు జారి కిందపడ్డాడు. దీంతో వెంటనే అతని పక్కన ఉన్న వ్యక్తి పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ కోసం ముంబయిలోని హర్బర్ ప్రాంతంకు చిత్ర యూనిట్ సభ్యులు చేరుకున్నారు. దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి, హీరోయిన్ అనన్య పాండేలు ముందుగా అక్కడకు చేరుకోగా, కొద్ది సమయం తర్వాత విజయ్ దేవరకొండ వచ్చాడు. రోడ్డు నుండి హర్బర్లోకి హడావిడిగా నడుస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ కాలు స్లిప్ అయ్యింది. పోర్ట్ ఏరియా కావడంతో అక్కడ అంత చిత్తడి చిత్తడిగా ఉంది. ఆ ఏరియా మొత్తం బురద నీరు ఉంది. అంతేకాదు దానికి కొంచెం పక్కలోనే చిన్న గుంత ఉంది. ఆ ప్లేస్ లోనే విజయ్ కాలు జారాడు. అక్కడికి వెళ్లిన విజయ్‌ని చూసిన అభిమానులు విజయ్ అన్న.. విజయ్ అన్న అంటూ అరవడం ప్రారంభించారు. వారిని చూస్తూ ముందుకు వెళ్తున్నఅతడు కాలు జారి కిందపడబోయారు. పక్కనే ఉన్న వారు పట్టుకోవడంతో ఆ గుంతలోకి పడలేదు.
ఈ క్రింది వీడియో చూడండి
ఇక అక్కడ ఉన్న మీడియా కన్నుల్లో ఇదంతా రికార్డ్ అయ్యింది. ఎవరో దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఫాన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయ్యా పూరీ జగన్నాథా. .మా అన్నాను జాగ్రత్తగా చూసుకో..అలా వదిలెయ్యకు అని ఒకరు పెడితే…అన్నా నీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేం…కొంచెం జాగ్రత్తగా నడువు అన్నా అని తమ ప్రేమను చూపిస్తున్నారు. ఇక విజయ్, పూరీ కాంబినేషన్ వస్తున్నా లైగర్ సినిమా మే లో రిలీజ్ కానుంది. ఇందులో ఒక కిక్ బాక్సర్ గా విజయ్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. వరుసగా ప్లాప్స్ వస్తుండడంతో విజయ్ ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరీ. చూడాలి మరి ఈ ఇద్దరి కాంబో ఎలా ఉంటుందో..
ఈ క్రింది వీడియో చూడండి