విజయ్ సేతుపతి రియల్ స్టోరీ

135

విజయ్ సేతుపతి .. ప్రస్తుతం ఈ పేరు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎవరికైనా టైం వస్తే ఇలాగే ఉంటుంది. అందుకే ఇతడు హీరోగా చేస్తూనే , మరోవైపు నెగెటివ్ రోల్స్ లో చేస్తూ మెప్పిస్తున్నాడు. పాత్ర ఏదైనా మెప్పించడం విజయ్ సేతుపతి ప్రత్యేకత. అందుకు తార్కాణమా 96 సినిమాలో సున్నిత ప్రేమికుడిగా నటించి ఆడియన్స్ మనసు దోచుకున్నాడు విజయ్ సేతుపతి. అలాగే మాస్టర్ సినిమాలో భయంకరమైన విలనిజం పండించాడు. తమిళనాడులోని రాజ పాల్యెం కి చెందిన విజయ్ సేతుపతి, సినిమా సినిమాకు సక్సెస్ సాధిస్తూ, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నాడు. అయితే ఇంత విజయం ఊరికే రాలేదు, దాని ఎంతో శ్రమ, కష్టం ఉంది. ఈ వీడియోలో విజయ్ సేతుపతి ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

బాల్యం, కుటుంబం, చదువు..
విజయ్ సేతుపతి 16 జనవరి 1978 న చెన్నై సమీపంలో ఉన్న రాజపాలయంలో జన్మించారు. ఇతని పూర్తీ పేరు విజయ గురునాథ సేతుపతి కలిముత్తు. ఇతనిని అభిమానులు “మక్కల్ సెల్వన్” గా పిలుస్తారు, అంటే “పీపుల్స్ ట్రెజర్” అని అర్థం. సేతుపతికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. [13] అతను ఆన్‌లైన్‌లో కలుసుకున్న మరియు డేటింగ్ చేసిన తన స్నేహితురాలిని వివాహం చేసుకోవడానికి 2003 లో దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. ఇతని భార్య పేరు జెస్సీ.

ఇతనికి కొడుకు సూర్య, కూతురు శ్రీజ ఉన్నారు. స్కూల్ లో చదివేటప్పుడు సేతుపతి బెస్ట్ ఫ్రెండ్ సూర్య చనిపోయాడు. అతని జ్ఞాపకం కోసం కొడుకుకు సూర్య అని పేరు పెట్టుకున్నాడు. ఇక విజయ్ సేతుపతి ఆరవ తరగతి వరకు రాజపాలయం చదివాడు. తర్వాత ఫామిలీ మొత్తం చెన్నై షిప్ట్ అయ్యారు. చెన్నైలోని కోడంబాక్కంలోని ఎంజిఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్, లిటిల్ ఏంజిల్స్ మాట్ హెచ్ ఆర్ సెక్ స్కూల్ లో చదివాడు. అయితే చదువులో రాణించలేకపోయాడు. దాంతో సినిమాల వైపు వద్దామని డిసైడ్ అయ్యి, 16 ఏళ్ళ వయసులో అంటే 1994 లో నమ్మవర్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాడు. అయితే సెలెక్ట్ కాలేకపోయాడు.

ఉద్యోగం, దుబాయ్ జీవితం..
సేతుపతి పాకెట్ మనీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. రిటైల్ దుకాణంలో సేల్స్ మాన్, ఫాస్ట్ ఫుడ్ జాయింట్ వద్ద క్యాషియర్, ఫోన్ బూత్ ఆపరేటర్ గా పనిచేశాడు. పనిచేస్తూ చదువును కొనసాగించాడు. అతను తోరైపాకం లోని ధన్రాజ్ బైద్ జైన్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందాడు. కాలేజ్ కంప్లీట్ చేసిన తరువాత, టోకు సిమెంట్ వ్యాపారంలో అకౌంట్ అసిస్టెంట్ ‌గా చేరాడు. ఆ సమయంలోనే దుబాయ్ లో అకౌంటెంట్ గా పనిచేయడానికి వెళ్ళాడు. దుబాయ్ ‌లో రెండేళ్లు పనిచేశాడు.

అక్కడే అతను ఆన్ ‌లైన్‌ లో జెస్సీ అనే మహిళను కలిశాడు. ఇద్దరూ ఇష్టపడి. చివరికి 2003 లో వివాహం చేసుకున్నారు. ఇక జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేక తిరిగి ఇండియా వచ్చాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత రెడీమేడ్ కిచెన్‌ లతో వ్యవహరించే మార్కెటింగ్ కంపెనీలో చేరాడు. అప్పుడే దర్శకుడు బలూ మహేంద్ర , నీలో చాలా ఫోటోజెనిక్ ముఖం ఉందని, సినిమాల వైపు వెళ్లి నటుడు అవ్వమని సలహా ఇచ్చాడు. అప్పుడు నటుడు అవ్వాలని డిసైడ్ అయ్యి మళ్ళి సినీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

సినీ కెరీర్…
చెన్నైకి చెందిన థియేటర్ గ్రూప్ కూతు-పి-పట్టరైలో అకౌంటెంట్, నటుడిగా జాయిన్ అయ్యాడు. అక్కడ ఇతర నటులను దగ్గరి నుండి గమనించాడు. అప్పుడే సినీ అవకాశం తలుపు తట్టింది. సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్సులు వచ్చాయి. అలాగే బుల్లితెర మీద సీరియల్స్ లలో కూడా నటించాడు. 2006 లో ప్రారంభమైన వెబ్ సిరీస్ పెన్, అలాగే నలయ ఇయకునార్ అనే టెలివిజన్ షోలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ ‌తో కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. నార్వేలో జరిగిన తమిళ చలన చిత్రోత్సవంలో షార్ట్ ఫిలిం పోటీలో అతనికి ఉత్తమ నటుడు అవార్డును ఇచ్చాడు. తర్వాత 2006 లో గ్యాంగ్ స్టర్ చిత్రంలో ధనుష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. తావతా ప్రభు సోల

మన్ లీ, వెన్నిలా కబాడి కుజు,నాన్ మహాన్ అల్లా లలో సైడ్ క్యారెక్టర్స్ లలో నటించారు. తర్వాత సీను రామసామి సేతుపతి ప్రతిభను గుర్తించారు. 2011 లో రామసామి నాటక చిత్రం అయినా తెన్మెర్కు పరువాకత్రు లో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఇందులో సేతుపతి గొర్రెల కాపరి పాత్ర పోషించాడు. ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆ సంవత్సరంలో ఉత్తమ తమిళ చలన చిత్రం అవార్డు రావడంతో సేతుపతి కెరీర్‌ ఒక మలుపు తిరిగింది. 2012 లో పిజ్జా,నాడువుల కొంజం పక్కా కనోమ్ సినిమాలలో హీరోగా ఛాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సేతుపతికి అవార్డ్స్ ను కూడా తీసుకొచ్చేలా చేశాయి.

2013 లో క్రైమ్ కామెడీ సినిమా అయినా సూదు కవ్వుమ్‌ లో నటించాడు. అందులో నలభై ఏళ్ల కిడ్నాపర్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత సేతుపతి వెనక్కి తిరిగిచూసుకోలేదు. వరుసగా, ఇధార్కుథనే ఆసిపట్టై బాలకుమార, రమ్మీ,పన్నైయారామ్ పద్మినీయుమ్, జిగార్తాండ, తిరుడన్ పోలీస్, బెంచ్ టాకీస్, ఆరెంజ్ ముట్టాయి, సేతుపతి, కావమ్, విక్రమ్ వేదా. జుంగా,96, సీతాకత్తి, సింధుబాద్, ఓ మై కాదవులే, సూపర్ డీలక్స్, మాస్టర్, ఇలా దాదాపు 50 సినిమాల వరకు నటించాడు. తెలుగులో కూడా విజయ్ సేతుపతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇతను నటించిన 96 సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించింది. తమిళ్ వర్షన్ నే తెలుగు ప్రేక్షకులు చూశారంటే ఆ సినిమా పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

అవార్డ్స్..
విజయ్ సేతుపతి నటించిన సినిమాలకు గాను బెస్ట్ యాక్టర్ గా కొన్ని అవార్డ్స్ సాధించాడు. 2012 లో సుందరపాండెన్ సినిమాకు గాను తమిళనాడు స్టేట్ ఫిలిం బెస్ట్ విలన్ అవార్డు గెలుచుకున్నాడు. నడువుల కొంజెం పక్కత్తా కొన్నాం సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా విజయ్ అవార్డు , నార్వే అవార్డు గెలుచుకున్నాడు. ఇక పిజ్జా సినిమాకు సైమా, ఫిలిం ఫేర్, చెన్నై టైమ్స్ ఫిలిం అవార్డు గెలుచుకున్నాడు,. సూదు కొవ్వుమ్ సినిమాకు విజయ్ అవార్డు, ధర్మ దురై సినిమాకు నార్వే అవార్డు, ఏషియా విషన్ అవార్డు, విక్రమ్ వేదా సినిమాకు ఫిలిం ఫేర్, విజయ్ అవార్డు, సూపర్ డీలక్స్ సినిమాకు మెల్ బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు, 96 సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇలా తన నటనా ప్రతిభకు ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నాడు.

ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇందులో తెలుగు సినిమా అయినా ఉప్పెనలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాడు. అలాగే శ్రీలంక క్రికెటర్ అయినా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అయినా 800 సినిమా, కరోనా కుమార్, ముంబైకర్, తుగ్లక్ దర్భార్, కాతు వాకులా రెండు కాధై.. ఇలా దాదాపు అరడజను సినిమాలకు పైగా లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.

Content above bottom navigation