అనసూయకు రోజాకు మధ్య వార్…

75

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులను అద్ది, టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. అటు టీవీ తెరపైనే కాకుండా.. వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది. మరోవైపు, తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రోజా, కొన్నేళ్లుగా బుల్లితెర పైనా రాణిస్తోంది. తమ తమ రంగాల్లో దూసుకుపోతోన్న ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు వార్ మొదలైంది. ఇన్ని రోజులు కలిసి పని చేసిన ఈ ఇద్దరూ ఒక విషయంలో పోటీ పడుతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది.? ఆ విషయం గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

ఈ క్రింది వీడియో చూడండి

బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రోగ్రామ్‌ లలో జబర్ధస్త్ ఒకటి. దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోన్న ఈ షోకు అనసూయ భరద్వాజ్ యాంకర్‌గా చేస్తుండగా, సీనియర్ హీరోయిన్ రోజా జడ్జ్‌ గా వ్యవహరిస్తోంది. ఈ కామెడీ షో ద్వారా వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగిపోయిందని చెప్పవచ్చు. రోజా, అనసూయ ఇద్దరూ జబర్ధస్త్ తో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అందుకే వీళ్ల మొదటి చాయిస్ ఈ షోకే ఇస్తున్నారు. అదే సమయంలో వేరే చానెళ్లలో ప్రసారం అవుతోన్న మరికొన్ని ప్రొగ్రామ్‌ లకు కూడా పని చేస్తున్నారు. దీంతో ఇద్దరూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. టీవీ రంగంలోనే కాదు.. ఇద్దరూ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్‌ లో కలిసి పని చేస్తున్న ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు వార్ మొదలైంది. వార్ అంటే తిట్టుకోవడమో.. కొట్టుకోవడమో.. ఒకరిపై ఒకరు కాలు దువ్వుకోవడం కాదు.. ఓ ప్రముఖ చానెల్‌ లో ప్రసారం కాబోతున్న రెండు షోలకు ఈ ఇద్దరూ వేరు వేరుగా హోస్టింగ్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు షోలలో దేనికి ఎక్కువ రేటింగ్ వస్తుందన్న దానిపై ఇద్దరి మధ్య పోటీ నెలకొంది.

Image result for anasuya roja

ప్రముఖ చానెల్ తల్లి, భార్య గురించి చెప్పుకునే సరికొత్త ప్రోగ్రామ్‌ కు శ్రీకారం చుట్టింది. ‘తల్లా పెళ్లామా’ అనే టైటిల్‌ తో రాబోతున్న ఈ కార్యక్రమానికి అనసూయ హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఇందులో బుల్లితెరపై సందడి చేస్తున్న సెలెబ్రిటీలు రాబోతున్నారు. మొదటి ఎపిసోడ్‌ కు ప్రముఖ యాంకర్ రవి.. తన తల్లి, భార్యతో కలిసి వచ్చాడు. ఆ ప్రోమో ఇప్పటికే విడుదలైంది. తల్లి గొప్పదనాన్ని చాటి చెప్పుకునే మరో ప్రోగ్రామ్ కూడా ఆ చానెల్‌లో రాబోతుంది. ఇక ‘అమ్మ సరిలేరు నీకెవ్వరు’ అనే పేరుతో రాబోతున్న మరో కార్యక్రమానికి రోజా హోస్ట్‌ గా చేస్తున్నారు. ఇందులో కూడా సెలెబ్రిటీలు సందడి చేయనున్నారు. మొదటి ఎపిసోడ్‌ లో జబర్ధస్త్‌లో పని చేస్తున్న పిల్లలు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇలా ఒకేసారి ఈ ఇద్దరు రెండు కొత్త పోగ్రామ్స్ తో వస్తున్నారు. చూడాలి మరి ఏ షోకు ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుందో.. వార్ లో ఎవరు గెలుస్తారో..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation