వరల్డ్ ఫేమస్ లవర్ తొలి రోజు వసూళ్లు బాక్సాఫీస్ బ‌ద్ద‌లుకొట్టే రికార్డ్

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ యూత్ ని బాగా ఆక‌ట్టుకుంది, స్టోరీ కొత్త‌గా ఉండ‌టం, విజ‌య్ న‌ట‌న న‌లుగురు హీరోయిన్ల‌తో చేసిన ఫెర్ఫామెన్స్ అత‌నికి మంచి పేరు తెచ్చింది….క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ హిట్ టాక్ వ‌చ్చింది అనే చెప్పాలి.. రాశీ ఖన్నా, కేథరీన్ త్రెసా, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ అయింది. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్ చూస్తే తొలిరోజు బాగానే బోనీ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1150 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా రూ.6.5 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి చిత్ర యూనిట్ తొలిరోజు అనుకున్న అంచ‌నాల‌ను ఈ చిత్రం సాధించింది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆక్యుపెన్సీ రేట్ 70.19 శాతం ఉందట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్‌డే రూ.8 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ థియేట్రికల్ రైట్స్ రూ.23.81 కోట్లకు అమ్ముడుపోయింది. ఇకపోతే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమానే తన చివరి ప్రేమ కథా చిత్రం అని విజయ్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక నుంచి లవ్ స్టోరీలు చేయనని చెప్పాడు. ‘‘నా సినిమాకి వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక కొత్త అనుభూతిని పొందాలనే సినిమాలు చేస్తుంటా.. ఈ సింగిల్ డబుల్స్ కొట్టడం మన వల్ల కాదు.. కొడ్తే సిక్సే.. ప్రతి బాల్‌ని బౌండరీ బాదాలనే చూస్తా అన్నాడు, దీంతో ల‌వ్ ఓరియెంటెడ్ చిత్రాలు ఇక ద‌ర్శ‌కులు విజ‌య్ కు రాసే ఛాన్స్ కూడా ఉండ‌దు, స‌రికొత్త విభిన్న క‌థ‌లు చేయాలి అని అనుకుంటున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

Image result for world famous loe

ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో బంతిని గట్టిగానే కొట్టా.. బంతి గాల్లో ఉంది.. మరి అది బౌండరీ బయటపడిందో.. క్యాచ్ ఔట్ అయ్యిందో సినిమా చూసి చెప్పాలి’ అని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ విషయానికొస్తే సినిమాలో క్రెడిట్ మొత్తం ఐశ్వర్య రాజేష్ పెర్ఫామెన్స్‌కి దక్కింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ రాశీ ఖన్నానే అయినప్పటికీ.. సువర్ణ పాత్రలో ఐశ్వర్య ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యకు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక వీకెండ్ కావ‌డంతో ఈ రెండు రోజులు సినిమాకి మంచి షేర్ వ‌చ్చే అవ‌కాశం ఉంది, పైగా టాలీవుడ్ లో ప్ర‌స్తుతం విడుద‌ల అయిన పెద్ద సినిమాలు ఏమీ లేవు ఇక సినిమాలు కూడా ఏమీ లేక‌పోవ‌డం విజ‌య్ మానియాతో ఈచిత్రానికి మంచి ప్ర‌మోష‌న్ వ‌చ్చింది.. అందుకే ఈ రెండు రోజులు దాదాపు మ‌రో 20 కోట్ల షేర్ వ‌స్తుంది అంటున్నారు టాలీవుడ్ ప్ర‌ముఖులు.

ఈ క్రింద వీడియో చూడండి: