జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే..
ఆయన సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా సందడిగా ఉంటారు.
నలుగురితో నవ్వుతూ అందరిని పలకరించే నైజం ఎన్టీఆర్ ది.
ఇక నందమూరి కుటుంబంలో చాలా చలాకీగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనవడిగా ఉంటారు.
ఇంటిలో ఫంక్షన్ కుఎంత దూరపు బంధువు పిలిచినా, ఆయన హైదరాబాద్ లో ఉంటే కచ్చితంగా అటెండ్ అయ్యేందుకు వెళతారు.
కాని పరిస్దితుల్లో కచ్చితంగా వారి భార్య లేదా అమ్మని అయినా పంపిస్తారు.
అంత విలువ ఇస్తారు ఆయన కుటుంబాలకి బంధువులకి.

ఇక సినిమాల్లో తారక్ క్రేజ్ మాములుగా ఉండదు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్‌కి దాసోహులైనవారే. టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఆయన కూడా ఒకరని చెప్పాలి. నెం.1 స్థాయికి పోటీ పడ్డ హీరో అని చెప్పాలి. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ జీవితం తొలినాటి నుంచి కూడా అవమానాల మయమే…. చంద్రబాబు నాయుడు ది సాధారణ రైతు కుటుంబం. రెండంటే రెండు ఎకరాల ఆస్తి నుంచి ఇప్పుడు బాబు జమానా చాలా పెద్దదే. అప్పట్లో నారాభువనేశ్వరిని బాబుకి ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేశారు.. తిరుపతి పని మీద వెళ్ళిన ఎన్టీఆర్ బాబుని వివరాలు కనుక్కుని చిటికెలో భువనేశ్వరికి ఇచ్చి పెళ్ళి చేశారు అంటారు అందరూ.
ఎన్టీఆర్‌కు జాతకాల పిచ్చి ఉండడంతో. చంద్రబాబు తల్లి చంద్రబాబు జాతకంలో రాజయోగం ఉన్నట్లు రాయించారు. అది చూసిన ఎన్టీఆర్ బాబుకు పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత కాలంలో ఆ జాతకం ఫలించడంతోనే ఆయన సీఎంగా చక్రం తిప్పుతున్నారని అందరూ చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని బాగా దూరం పెట్టేవారని తెలుస్తోంది. అతడు ఎదిగిన తర్వాత మాత్రమే నందమూరి ఫ్యామిలీలోకి రానిచ్చారని అందరూ అంటారు. ఆ మాటకి వస్తే సీనియర్ ఎన్టీఆర్ సైతం జూనియర్ ఎన్టీఆర్ తల్లిని, జూనియర్ ఎన్టీఆర్‌ని ఇంట్లోకి రానివ్వకుండా దూరం పెట్టారు అంటారు. ఎన్టీఆర్‌కు చిన్న కొడుకు చిన్న కూతురు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ చిన్న కూతురు వివాహానికి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్, అతని తల్లిని తీసుకొచ్చారు.
పెళ్ళికి వస్తున్న వాళ్ళపై ఎన్టీఆర్ కోపడ్డారట.. హరి కృష్ణను చడామడా తిట్టి గెట్ అవుట్ అన్నారంట. దీంతో హరికృష్ణ తన రెండవభార్యను, ఎన్టీఆర్‌ను తీసుకుని వెళ్ళిపోయారట. తన స్వతహాగా ఎదిగి మంచి పేరును క్రేజ్‌ను సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్. తండ్రిపోయాక ఇప్పుడు కళ్యాణ్‌రామ్ కెరియర్ని ఇంట్లో అన్నీ చూసుకునేది జూనియర్ ఎన్టీఆర్‌నే అట. అలాగే వాళ్ళ అమ్మగారి మంచి చెడులన్నీ చూస్తున్నారని సమాచారం. కళ్యాణ్‌రామ్ కూడా ఎన్టీఆర్‌ని అడగకుండా ఏ మూవీకి సైన్ చేయడంలేదట. అలాగే ఎన్టీఆర్ కళ్యాణ్‌రామ్ వాళ్ళ అమ్మను పెద్దమ్మా అని పిలుస్తారని పలువురు అంటుంటారు. హరికృష్ణ లేకపోవడంతో ఇరు కుటుంబాల బాధ్యతలు నిర్మాణం అన్నీ జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటున్నారట.