ప్రభాస్ కు జాతక సమస్యలు అందుకే ఏం చేస్తున్నాడంటే

బాహుబ‌లి త‌ర్వాత గ్యాప్ తీసుకుని ప్ర‌భాస్ సాహో సినిమా చేశారు.. అయితే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీసినా అనుకున్నంత హిట్ అయితే అవ్వ‌లేదు, దీంతో ఈ సినిమాపై పెట్టుకున్న అంచ‌నాలు అన్నీ అడియాశ‌లు అయ్యాయి, అయితే ఇప్పుడు డిఫ‌రెంట్ జాన‌ర్ తో సినిమా చేస్తున్నారు, దానికి జాను అనే టైటిల్ అనుకున్నారు.. కాని దిల్ రాజు సినిమాకి ఇచ్చేశారు.. తాజాగా దీనికి మ‌రో కొత్త టైటిల్ పెట్టారు.ప్రభాస్ జిల్ రాథాక్రిష్ణ మూవీని మొదలు పెట్టడానికి చాల సమయమే తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో ఈ సినిమా కథకు సంబంధించి అనేక చర్చలు ప్రభాస్ జిల్ రాథాక్రిష్ణ కృష్ణంరాజుల మధ్య జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా కథ యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమ కథ అయినప్పటికీ ఈ కథ అంతా జాతకాల చుట్టూ తిరుగుతుంది.

ప్రభాస్ కు జాతక సమస్యలు !

అనేక ఆలోచనలు తరువాత ఓ డియర్ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర, ఎదుటి మనిషికి ఏర్పడబోయే జాతక సమస్యలను ముందుగానే గ్రహించి ఆ సమస్యల నుండి వారిని రక్షించే పాత్ర అని తెలుస్తోంది.. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే పాత్రకు రాబోయే కష్టాలను ముందుగానే తన మానసిక స్థితితో ఊహించి ప్రభాస్ పూజా హెగ్డే ను రక్షిస్తూ ఉంటాడు.వాస్తవానికి ఇలాంటి కథలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ నవల ముత్యమంతా ముద్దు నవల ఆధారంగా ఒక మూవీ రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చింది. అలాగే ఇలాంటి కథతోనే మరికొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఆ మూవీలు అన్నీ పెద్దగా విజయవంతం కాలేదు.

ప్రేక్షకుల అభిరుచి మారిపోయిన ఇలాంటి పరిస్థితులలో జాతకాల చుట్టూ తిరిగే కథను ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న అపనమ్మకం ప్రభాస్ కు ఉన్నా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పైగా పూర్తి అయిన పరిస్థితులలో ఈ మూవీ కథలో ఎన్ని మార్పులు చేసినా మళ్ళీ కథ జాతకాల చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ప్రభాస్ కన్ఫ్యూజ్ అవుతున్నాడని టాక్. సాహో ఫెయిల్యూర్ తరువాత విడుదల కాబోతున్న మూవీ కాబట్టి ఈ మూవీ హిట్ కొట్టి తీరాలి అన్న పట్టుదలతో ప్రభాస్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు, అయితే ప్ర‌భాస్ కు కొన్ని జాతక స‌మ‌స్య‌లు ఉన్నాయట. అందుకే గ‌త ఏడాది సినిమా స‌క్సెస్ అవ్వ‌లేదు అంటున్నారు, దీనికి సంబంధించి పూజ‌లు కూడా చేయించార‌ట… వ‌చ్చే ఏడాది రాజ‌యోగం ఆయ‌న‌కు ఉంది అని తెలుస్తోంది, అందుకే ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయాలి అని ప్లాన్ వేస్తున్నార‌ట‌, అందుకే వ‌చ్చే ఏడాది పెళ్లి కూడా ఫైన‌ల్ చేసుకుంటాడ‌ట ప్ర‌భాస్.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation