జాను రివ్యూ.. ఇంతగొప్ప ప్రేమకథ మళ్ళీ తెలుగులో రాదేమో

11722
Prev post

శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ సినిమాకు ఇది రీమేక్. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు వర్షన్‌ను తెరకెక్కించారు. అలాగే ఆ చిత్రానికి పనిచేసిన గోవింద వసంత తెలుగుకు కూడా సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ క్లాసిక్ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. ముందు కథలోకి వెళ్లినట్టయితే…. రామ్ ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్. కొన్ని పరిస్థితుల రీత్యా తాను చదువుకున్న స్కూల్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితులు అంతా కలిసి ఒక గెట్ టు గేదర్ ను ఏర్పాటు చెయ్యగా అక్కడికి జాను కూడా వస్తుంది. ఒకప్పుడు ఒకే క్లాస్ స్కూల్ కు చెందిన జాను మరియు రామ్ ల మధ్య జరిగిన స్టోరీ ఏమిటి? వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. చాలా కాలం తర్వాత కలిసిన వీరిద్దరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?అప్పుడు ప్రేమించుకున్న వీళ్ళ ప్రేమకు ముగింపు ఎలా వచ్చింది? వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఆకట్టుకుంది అన్నదే మిగతా కథ.

Image result for jaanu movie poster

ఇక ఈ సినిమా గురించి విశ్లేషిస్తే…..తమిళ్ లో 96 గా విడుదల అయినా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో కూడా మంచి అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి. ఆల్రెడీ ఎమోషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా అదే దర్శకుడితో ప్లాన్ చెయ్యడం వలన సినిమా ఫలితాన్ని అందుకోకుండా ఉంటుంది అనుకోలేం. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గుట్టుగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే 96 చిత్రాన్ని చూసేసిన వారికి ఈ సినిమా పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఈ రీమేక్ కూడా బాగున్నా దాని ఒరిజినల్ వెర్షన్ వైపే మొగ్గు చూపుతారు. కానీ తమిళ్ లో ఈ చిత్రాన్ని ఫాలో అవ్వని వారికి “జాను” ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా శర్వానంద్, సమంతల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే కథ మొత్తం వీరి మీదనే నడుస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని లవ్ ట్రాక్స్, ఎమోషనల్ సన్నివేశాలు అయితే మంచి లవ్ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి ట్రీట్ లా ఉంటాయి. అంతలా వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ కానీ చాలా చక్కగా వచ్చాయి. అయితే సినిమా అంతా లవ్ అనే ఎమోషన్ లో కొత్త కోణాన్ని చూపించినా , సినిమా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది తెలుగు ప్రేక్షకులకు కొంత బోర్ గా అనిపించొచ్చు.

Image result for jaanu movie poster

పెర్ఫామెన్స్ ల పరంగా అయితే శర్వానంద్, సమంతలు ఎక్కడా తక్కువ చెయ్యడానికి లేదు. ఇక దర్శకుని పని తీరుకు వచ్చినట్టయితే తమిళ్ లో ఇప్పటికే తెరకెక్కించిన దర్శకునికి తెలుగులో కూడా అదే స్థాయి అవుట్ ఫుట్ ను రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు. తనకు కావాల్సింది అంతా రాబట్టుకున్నారు. ఎమోషన్స్, కెమిస్ట్రీ, నటన ఇలా అన్ని కోణాల్లోనూ సినిమాకు తగ్గట్టుగా రాబట్టేసారు. అయితే తెరకెక్కించిన విధానంలో ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఉంటె బాగుండు అని అనిపించింది. సినిమా సోల్ ను దెబ తియ్యకుండా చేసిన ప్రయత్నంలో కథనాన్ని నెమ్మదిగా కాకుండా స్పీడప్ చేస్తే బాగుండేది. అలాగే మహేందిరన్ జయరాజు అందించిన సినిమాటోగ్రఫీలోని మ్యాజిక్ శర్వాను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ తోనే మొదలవుతుంది. అలాగే గోవింద్ వసంత అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకు మరింత జీవం పోశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే… శర్వానంద్, సమంతల, కథ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్స్. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. ఓవరాలుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే… ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది. స్కూల్ ఏజ్ లలో లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రతి ఒక్కరు కూడా తమ జ్ఞాపకాలలోకి వెళ్లారు. సమంత, శర్వానంద్ లలో తమకు ఊహించుకుని, ఇది మా కథే అనేలా ఫీల్ అవుతారు. అయితే మిగతా వారికీ ఈ సినిమా ఎంతలా నచ్చుతుంది అనే దానిపై ఈ సినిమా రిజల్ట్ ఆదారపడి ఉండి.

ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3 / 5

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation
Prev post