సీనియర్ హీరొయిన్ భానుప్రియ‌ ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో చూస్తే పాపం అంటారు

సంప్రదాయ నృత్య కళల్లో ఒకటైనది భరత నాట్యం, ఇందులో ప్రావీణ్యం సంపాదించి సినిమాల్లో న‌టించిన న‌టీమ‌ణులు ఎంద‌రో ఉన్నారు, త‌ర్వాత అవ‌కాశాలు వ‌చ్చినా వివాహం చేసుకుని విదేశాల‌కు వెళ్లిన అంద‌మైన ముద్దుగుమ్మ‌లు ఉన్నారు, మ‌న క‌ల‌ల్లో భ‌ర‌త‌నాట్యానికి చాలా మంది అభిమానులు ఉన్నారు, ఇక హీరోయిన్ గా అవ‌కాశాలు కూడా ఆ నృత్య‌న‌ర్త‌ణిల‌కు వ‌చ్చేవి, అలాంటి న‌టీమ‌ణిగా పేరు సంపాదించారు సీనియర్ నటీమణి భానుప్రియ.స్వతహాగా మన భారతీయ సాంప్రదాయ నృత్య కళల్లో ఒకటైన భరత నాట్యంలో ఎంతో ప్రావీణ్యత గల భానుప్రియ, అక్కడక్కడ కొన్ని సినిమాలో చేసే నృత్యం చూస్తే నిజంగా కనులకు ఎంతో వీనుల విందుగా ఉంటుందని చెప్పాలి.ఇక ద‌ర్శ‌కుడు విశ్వనాధ్ తెర‌కెక్కించిన స్వర్ణకమలం సినిమాలో ఆమె పోషించిన పాత్ర సూప‌ర్ హిట్ , అందులోని పాటల్లో ఆమె చేసిన నాట్యాన్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు .

Image result for భానుప్రియ‌

ముందుగా దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో టాలీవుడ్ కి నటిగా పరిచయం అయిన భానుప్రియ, తొలి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించారు.ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన భానుప్రియకు అప్పట్లో కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు దక్కడంతో పాటు అప్పటి స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా అవకాశాలు దక్కాయి.ఆ తరువాత మెల్లగా సినిమాలు తగ్గించిన భానుప్రియ, 1998లో అమెరికా లోని క్యాలిఫోర్నియా లో ఆదర్శ్ కౌశల్ అనే గ్రాఫిక్ ఇంజినీర్ ని వివాహం చేసుకున్నారురు. ఆ తరువాత వారికి 2003లో అభినయ అనే కుమార్తె పుట్టడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన భర్త కౌషల్ నుండి 2005లో విడాకులు తీసుకుని విడిపోయిన భానుప్రియ, ఆపై ఇండియాకి తిరిగివచ్చి అక్కడి నుండి చెన్నైలో తన కుమార్తె తో కలిసి నివాసం ఉంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఇటీవల మళ్ళి చాలా గ్యాప్ తరువాత సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు భానుప్రియ గురించి బయటకువచ్చిన కొన్ని విషయాలు వింటే నిజంగా గుండె తరుక్కుపోతుంది.ఆమెకు కనీసం ఒక ఇల్లు కూడా లేదని, చెన్నైలో ఆమె ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. ఇక వ్యక్తిగతంగా ఎంతో మానసిక వ్యాధితో నలిగిపోయిన భానుప్రియ ఇప్పటికీ అక్కడక్కడా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితం గురించి మరొకరికి చెప్పి ఇబ్బంది పెట్టరట‌… ఎప్పుడూ సెట్స్ కి వచ్చినా తరువాత తన పని చేసుకుని వెళ్లడమే ఆమెకు అలవాటని పలువురు నటులు అంటున్నారు. ఇటీవల ఆ మధ్య ఆమె ఇంట్లో పనిమనుషులు వస్తువుల చోరీ చేసిన ఘటన వివరాలు బయటకు వచ్చాయి. ఆ ఘటనలో భానుప్రియపై ఒక కేసు కూడా నమోదు అయింది. అయితే వ్యక్తిగతంగా భానుప్రియ ఎంతో మంచివారని, ఆమె ఇంట్లో చోరీ విషయమై ఆమెపై అన్యాయంగా కేసు పెట్టారాని ఆమె ఇంటి చుట్టుప్రక్కల వారు కూడా అంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కూడా ఆమె పరిస్థితి దాదాపుగా అంతే దయనీయంగా ఉందని అంటున్నారు. అయితే ఆమెకు రాబోయే రోజుల్లో అంతా మంచే జరగాలని, అలానే మంచి అవకాశాలు లభించి ఆ భగవంతుడు ఆమెకి మంచి జీవితం ఇవ్వాల‌ని కోరుకుందాం..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation