శ్రీకాకుళం జిల్లా కవిటిలో పుట్టిన కరాటే కళ్యాణి.. విజయనగరంలో పెరిగింది. అయితే కళారంగంపై ఉన్న మక్కువతో నాటికలు, బుర్రకథ, హరికథల్లో ప్రావీణ్యం సంపాదించిన కళ్యాణి.. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి బోల్డ్ నటిగా పాపులర్ అయ్యింది. బాబీ పిండేశావ్ అంటూ లేటు వయసులో కూడా అందాలను ఆరబోసి బోల్డ్ నటిగా పేరొందింది.
అయితే బాబీ అనే క్యారెక్టర్ జనాల్లోకి బాగా వెళ్లిపోయినప్పటికీ తన రియల్ క్యారెక్టర్ అది కాదు అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చిన ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.