“వరల్డ్ ఫేమస్ లవర్” మూవీ రివ్యూ

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక తన స్టైల్లో విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రమోషన్స్ సినిమాపై విపరీతమైన బజ్, హైప్‌ను క్రియేట్ చేశాయి. వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందొ చూద్దామా.

Image result for world famous lover

ముందు కథలోకి వెళ్లినట్టయితే…. గౌతమ్, యామినిలు తమ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు. అలాగే మరోపక్క భార్య భర్తలైన శీనయ్య, సువర్ణలు ఓ సామాన్య మధ్య తరగతి జీవనం గడుపుతుంటారు. ఇలా సాగిపోతున్న ఈ ఇద్దరు జీవితాలలోకి క్యాథరిన్, ఇజబెల్ లేయిట్ లు వస్తారు. అసలు వీళ్లకు వాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ గౌతమ్, శీనయ్యలు ఇద్దరా లేక ఒకరా? వారి వెనుకున్న కథలు ఏమిటీ అన్నదే మిగతా కథ.

ఇక ఈ సినిమా గురించి విశ్లేషిస్తే…..విజయ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోల్చుకున్నట్టయితే ఈ చిత్రానికి ఏమంత భారీ బజ్ ఏర్పడలేదు. అయినా విజయ్ తనదైన ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ తెచ్చుకున్నాడు. అయితే ఆ హైప్ సినిమా చూసాక పెద్దగా కంటిన్యూ కాకపోవచ్చు. మొదటగా కంటెంట్ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రం హీరోతో కలిపి మొత్తం ఐదుగురు పాత్రల చుట్టూ తిరుగుతుందన్న సంగతి అందరికీ ముందే తెలిసిన విషయమే. కానీ సినిమాలో మాత్రం విజయ్, ఐశ్వర్య, రాశి ఖన్నాల రోల్స్ కీ రోల్ పోషించాయి. విజయ్ అయితే ఒకే సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించి తనదైన నటనతో మరోసారి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నలుగురు హీరోయిన్లకు నాలుగు వేరియేషన్స్ లో ఓ పక్క తనలోని ప్లే బాయ్ పాత్రను, మరోపక్క లవర్ బాయ్ గా, ఓ భర్తగా అద్భుతమైన నటనను కనబర్చారు. అలాగే ఈ సినిమాకు నటన పరంగా మరో మెయిన్ ఎస్సెట్ ఐశ్వర్య రాజేష్ అని చెప్పాలి. ఓ మధ్య తరగతి జీవనం గడిపే భార్యగా మంచి నటన కనబర్చింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన బెస్ట్ ను అందించింది.

ఈ క్రింది వీడియోని చూడండి

అలాగే రాశీ కూడా మంచి పెర్ఫామెన్స్ ను కనబర్చింది. ఇలా ఫస్టాప్, సెకండాఫ్ లు జస్ట్ ఓకే గానే అనిపిస్తాయి తప్ప సినిమా చూసే ప్రేక్షకుడికి ఏమంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఇక దర్శకుడు క్రాంతి మాధవ్ తన సినిమాలో పాత్రలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వారిపై నడిచే కథకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. తాను తీసుకున్న నాలుగు ట్రాక్స్ లో రెండు ట్రాక్స్ సినిమాలో ఏమంత ఇంపాక్ట్ ను కలిగించవు. దాని మూలాన తాను చెప్పదలచుకున్న జీవిత సూత్రం మిస్ ఫైర్ అయ్యింది. అలాగే నెమ్మదిగా సాగించే కథనం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువయ్యిపోవడం, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ హంగులు లేకపోవడం వంటివి సినిమా చూసే ప్రేక్షకునికి ఆసక్తిని తగ్గించేస్తాయి. అలాగే ఇంతకు ముందు అద్భుతమైన ఆల్బమ్స్ ను ఇచ్చిన గోపీ సుందర్ ఈ సినిమాతో విజువల్ గా ఓకే అనిపిస్తారు. జయకృష్ణ గుమ్మడి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే… విజయ్, రాశీఖన్నా, ఐశ్వర్యల పెర్ఫామెన్స్, మ్యూజిక్. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…. సీరియస్ ఫ్లో లో సాగే కథనం, స్క్రీన్ ప్లే, అర్జున్ రెడ్డి షేడ్స్ కనపడటం, డైరెక్షన్. ఓవరాలుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే… లవర్స్ డే కానుకగా వచ్చిన ఈ సినిమా విజయ్, ఐశ్వర్య, రాశీ ఖన్నాల మధ్య ఎమోషనల్ ట్రాక్స్ పండినా సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం వలన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు. మరి విజయ్ ఫాన్స్ ఈ చిత్రాన్ని ఎక్కడ వరకు తీసుకెళ్తారో చూడాలి.

ఈ సినిమాకు మేము ఇస్యూన్న రేటింగ్ 2.5 / 5

ఈ క్రింది వీడియోని చూడండి :