Saturday, June 19, 2021

వ‌కీల్ సాబ్ డైరెక్ట‌ర్ తో నేచురల్ స్టార్ కొత్త మూవీ

Must Read

వకీల్ సాబ్ మూవీ హిట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్. ప‌రుగెత్తి పాలు తాగ‌డం కంటే నిల‌బ‌డి నీళ్ళు తాగ‌డం బెట‌ర్ అనుకుంటాడు ఇతను అందుకే అత‌ను ఇప్ప‌టి వరకు కేవ‌లం మూడు సినిమాలే తీసాడు. 2011లో ఓ మై ఫ్రెండ్, 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి త‌ర్వాత మ‌ళ్ళీ ఇంతకాలానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో వ‌కీల్ సాబ్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూడు సినిమాల‌ను నిర్మించింది దిల్ రాజే కావ‌డం మరో విశేషం.

అయితే అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ చేసి ఉండాల్సింది. కొన్ని కార‌ణాలు వల్ల అది కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ఏమంటే… ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నానికి వేణు శ్రీరామ్ ఓ స్టోరీ లైన్ చెప్పాడ‌ట‌. అది న‌చ్చ‌డంతో దానిని పూర్తి స్థాయి క‌థ‌గా మ‌ల‌చ‌మ‌ని నాని అన్నాడ‌ట‌. అల్లు అర్జున్ ఐకాన్ సంగ‌తి పక్కన పెట్టి వేణు శ్రీరామ్… హీరో నానితో ఓ మూవీని అతి త్వ‌ర‌లోనే చేస్తాడ‌ని ఫిలిం నగర్ వర్గాల టాక్.

ఇప్ప‌టికే ట‌క్ జ‌గ‌దీశ్ మూవీని పూర్తి చేసిన నాని, శ్యామ్ సింగ‌రాయ్ షూటింగ్ లో ప్ర‌స్తుతం పాల్గొంటున్నాడు. దాని త‌ర్వాత అంటే సుంద‌రానికి… మూవీ పూర్తి చేయాల్సి ఉంది. ఆ త‌ర్వాతే వేణు శ్రీరామ్ మూవీ ప‌ట్టాలెక్కుతుంది. విశేషం ఏమంటే… గ‌తంలో నాని, వేణు శ్రీరామ్ తో మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే ఈ సినిమానూ కూడా నిర్మిస్తాడ‌ని సమాచారం.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This