Saturday, June 19, 2021

లాక్ డౌన్ కష్టాలు: డ్రైవ‌ర్ గా మారిన హీరోయిన్

Must Read

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే.ఇక రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణంలో ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రంగాలు, పరిశ్రమలు మూతపడటంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు.ఇక ఈ నేపథ్యంలో ఎందరో కూలీల పరిస్థితులు దారుణం గా మారాయి. అంతేకాకుండా కొందరు ఉద్యోగస్తులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చాలా మంది న‌టీన‌టులుగా కూడా షూటింగ్స్ లేకపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఓ సినీ నటి మాత్రం ఆర్థికంగా తనకు ఇబ్బందులు ఉండటం తో ఏకంగా ట్రక్కు డ్రైవర్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

మ‌ల‌యాళంతో పాటు ప‌లు త‌మిళ చిత్రాల‌లోనూ నటించిన కార్తీక చిన్న‌ప్ప‌టి నుండి న‌ట‌న అంటే ఇష్టం ఉన్న కార్తీక యుక్త వ‌య‌సులో సినిమా న‌టిగా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించింది. అందులో స‌క్సెస్ అయ్యింది కూడా. కానీ ఆ త‌ర్వాత వివాహానంత‌రం ఆమె న‌ట‌న‌కు దూర‌మైంది. అయితే న‌ట‌న‌తో పాటు చిన్న‌ప్ప‌టి నుండి త‌న‌కు ఇష్ట‌మైన డ్రైవింగ్ పై దృష్టి పెట్టింది. సొంత గ్రామంలో ప‌లు వాహ‌నాల‌ను డ్రైవింగ్ చేయ‌డం ప్రాక్టీస్ చేసిన కార్తీక గ‌త యేడాది లాక్ డౌన్ వ‌ల్ల‌ ఉపాథి అవ‌కాశాలు దొర‌క‌పోవ‌డంతో ప్రొఫెష‌న‌ల్ డ్రైవ‌ర్ గా మారిపోయింది. ఇక తానే సొంతంగా ఒక ట్రక్కు కొనుక్కుంది.కేరళలో పైనాపిల్, కొబ్బరి బోండాలు వంటివి తక్కువ ధరకు దొరికే ప్రాంతం నుండి మంచి గిట్టుబాటు ధర పలికే ప్రాంతాలకు తరలిస్తుంది.దీంతో ఆమె ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది.

రాత్రిపూట ట్ర‌క్ న‌డ‌ప‌డం అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని, ఆ స‌మ‌యంలో టీ ష‌ర్ట్, జీన్స్ ధ‌రిస్తుంటాన‌ని, దానిపై డ్రైవ‌ర్స్ డ్ర‌స్ వేసుకుంటాన‌ని కార్తిక చేబుతోంది. కార్తీక‌ ట్ర‌క్ డ్రైవింగ్ చేస్తుండ‌గా ఇటీవ‌ల ఓ చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర పోలీసులు ఆపి, ఆమె నుండి వివ‌రాలు సేక‌రిస్తుంటే, ఆమె ఓ న‌టి అనే విష‌యాన్ని గుర్తించిన పోలీసులు ఆమె ఉన్న‌ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ మ‌రోసారి కార్తీక మాథ్యూపై ప‌డింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This