Friday, July 30, 2021

ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు నాన్ లోకల్ గొడవ .. ప్రకాష్ రాజ్ ఆశక్తికరమైన కామెంట్స్

Must Read

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ సమస్య ఎందుకు వస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు ..గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? అని ప్రశ్నించారు.

గత ఆరు నెలలగా తమ ప్యానల్ కార్యక్రమం నడుస్తోందని చెప్పారు. “మన ప్యానెల్ లో ఎవరు ఉండాలి.. ఎలాంటి వారు ఉండాలి అని చూసాం.. మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం.. ఇది ‘మా’ ఆవేదన.. గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి.. నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు ఉన్నారు.. నేను తప్పు చేసినా బయటికి పంపిస్తారు” అని ప్రకాష్ రాజ్ అన్నారు.

మా ఎన్నికల్లో ఈ సారి త్రిముఖి పోటి నెలకొనేలా ఉంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఆల్రెడీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే నటి హేమ కూడా తలపడేందుకు సిద్దమయ్యారు. ప్రకాష్ రాజ్ మాత్రం గెలిచేందుకు కొంతమందితో తన టీంను రెడీ చేసుకున్నారు. జ‌య‌సుధ‌, శ్రీకాంత్‌, బెన‌ర్జీ, సాయికుమార్‌, తనీష్, ప్ర‌గ‌తి, అన‌సూయ‌, స‌న, అనిత చౌద‌రి, సుధ‌, అజ‌య్‌, నాగినీడు, బ్ర‌హ్మాజీ, ర‌విప్ర‌కాష్‌, స‌మీర్‌, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, భూపాల్‌, టార్జ‌ాన్‌, సురేష్ కొండేటి, ఖ‌య్యుం, సుడిగాలి సుధీర్ మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో ప్రకాష్ రాజ్ తన లిస్ట్‌ను ప్రకటించేశారు.
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This