Saturday, June 19, 2021

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హీరోయిన్ భూమిక..

Must Read

బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. అత్యధిక ప్రేక్షకాదరణ పొందడంతో బిగ్ బాస్ రియాలిటీ షో ను తెలుగు, హిందీ ,కన్నడ, తమిళ, మలయాళం భాషలలో ప్రసారం చేస్తున్నారు. ప్రతి ఒక్క భాషలో కూడా బిగ్ బాస్ కేవలం ఒక సీజన్ కి పరిమితం కాకుండా పలు సీజన్లలో దూసుకుపోతోంది.బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లో చాలామంది మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

అయితే ఈ షో గురించి, ఆమెకు వస్తోన్న ఆఫర్ల గురించి హీరోయిన్ భూమిక తాజాగా స్పందించారు. తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే గానీ వాటిని ఇంత వరకు అంగీకరించలేదు.. ఎప్పుడూ అంగీకరించను కూడా అని తెగేసి చెప్పేశారు. 24 గంటలు కెమెరా ముందే ఉండటం నాకు ఇష్టం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక హిందీలో పద్నాలుగు సీజన్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో ఆమె ఎంట్రీ ఖాయం అన్నట్లుగా పలు వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. దీంతో ఈ వార్తలపై భూమిక వాటిని అసత్య కథనాలుగా కొట్టిపారేసింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This