Thursday, June 24, 2021

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?

Must Read

కన్నడ నటి అయిన హీరోయిన్ ప్రణీత తెలుగు సినిమాల్లో నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ,జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో పాటు చాలామంది కుర్ర హీరోలతో కూడా నటించింది, ఇక అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన బాపుగారి బొమ్మలా ఎంత ముద్దుగా నటించింది.అయితే ఈ బుట్టబొమ్మ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని తన ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది.

కరోనా కారణంగా ఎవరికీ చెప్పకుండా తమ కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య లోనే పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి ఫోటోలు కూడా నెట్ లో చాలా ఆలస్యంగా బయటకు వచ్చాయి.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గత శుక్రవారమే ప్రణీత వివాహం జరిగినట్లు బంధువులు వెల్లడించారు. వరుడు బెంగళూరుకు చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ నితిన్ రాజ్ అని సమాచారం. ఈ పెళ్ళి విషయాన్ని వరుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వార్తలు బయటకు వచ్చాయి. ప్రణీత పెళ్లి ఫోటోలు నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే ప్లాన్ ప్రకారం పెళ్ళి భారీగా, గ్రాండ్ గా చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల చాలా సింపుల్గా జరుపుకున్నారు.

అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహమా ప్రేమ పెళ్ళా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ప్రణీతపై కొంత మంది ఫ్యాన్స్ అలిగారు. ఎందుకంటే సోషల్ మీడియా నెట్ వర్కింగ్ లో ఈమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆమె చేసుకున్న వ్యక్తి అంత అందంగా లేడని ఇద్దరి జోడీ అస్సలు బాలేదు అని సెటైర్లు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ మొత్తం ఒక్కసారిగా షాకయ్యారు. సినిమాల పరంగా తెలుగులో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయింది. ఈ టైంలో ఈ పెళ్లి వార్తతో ఒక్కసారిగా నెట్ లో వార్తలు గుప్పుమన్నాయి

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This