Saturday, June 19, 2021

తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

Must Read

ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న విషయమైన సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు మనిషి బ్రతికుండగానే చనిపోయినట్టు వచ్చే వార్తలు చూస్తూనే ఉన్నాం.. తర్వాత ఆ సెలబ్రెటిలు మేము బ్రతికే ఉన్నాం రా బాబు అని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా సీనియర్‌ నటి ప్రేమ రెండో పెళ్లికి రెడీ అయిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి ఊపందుకున్నాయి. త్వరలోనే ఆమె మూడు ముళ్లు వేయించుకోనుందంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

హీరోయిన్ ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్‌ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ మధ్య ఈమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రాగా, అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించిన ప్రేమ న‌ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ప్రేక్షకుల గుండెల్లో సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ ‌ నెట్లో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రేమ ఆ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. అలాగే తన ఆరోగ్యం మీద వస్తున్న పుకార్లను నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాట్టు తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This