Saturday, June 19, 2021

పండంటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన ప్రభాస్ హీరోయిన్

Must Read

శేఖ‌ర్ క‌మ్ముల దర్శకత్వం వహించిన లీడ‌ర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ. ఆ త‌ర్వాత మిర‌ప‌కాయ్, మిర్చి, నాగ‌వ‌ల్లి వంటి తెలుగు సినిమాల‌తో పాటు కోలీవుడ్ లోనూ ప‌లు చిత్రాల్లో న‌టించి హీరోయిన్ గా త‌న‌కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. నాగార్జున భాయ్ చిత్రంలో చివ‌ర‌గా న‌టించిన రిచా ఆ త‌ర్వాత అమెరికా తిరిగి వెళ్ళిపోయి, బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్స్ చేసింది.

ఇక 2019లో త‌న స్నేహితుడు జోయ్ లంగెల్లాను రిచా పెళ్లి చేసుకుంది. అయితే క‌రోనా స‌మ‌యంలో ప్రెగ్నెంట్ గా ఉన్న రిచా గంగోపాధ్యాయ ఈ రోజు ఉద‌యం ఇన్ స్టాగ్రామ్ లో తాను బిడ్డకు జన్మనిచ్చినట్టు ‌ తెలియ‌చేస్తూ, త‌న కొడుకు ఫోటోను పోస్ట్ చేసింది. మే 27న రిచా గంగోపాధ్యాయ జ‌న్మ‌నిచ్చిన ఈ బాబుకు లుకా షాన్ లంగెల్లా అనే పేరు పెట్టారు.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో త‌న‌కు ఎంతో చ‌క్క‌గా చూసుకున్న డాక్టర్ లకు, కుటుంబ స‌భ్యుల‌కు రిచా ధ్యాంక్స్ చెప్పింది. ఇత‌ర ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు, స్నేహితుల‌కు ఎప్పుడెప్పుడు త‌న చిన్నారి బాబును ప‌రిచయం చేస్తానా అని ఉన్న‌దంటూ రిచా తన అనుభవాన్ని షేర్ చేసుకుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This