Saturday, June 19, 2021

గుడ్ న్యూస్: సమంత గర్భవతి, ఇదిగో ప్రూఫ్..!

Must Read

దాదాపు పదేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగుతుంది సమంత. ‘ఏమాయ చేశావే’ అనే సినిమాతో వచ్చిన ఈ భామ.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. వరుసగా హిట్లు మీద హిట్లు అందుకుంటూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే దాదాపు అందరు హీరోలతోనూ నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. సాధారణంగా
కెరీర్ కంటే ఏది ముఖ్యం కాదు అన్న ధోరణిలో ఉంటారు హీరోయిన్స్. కోట్ల సంపాదన, తరగని ఆస్తులు ఉన్నా, ఇమేజ్, పాపులారిటీ సంపాదించినా ఇంకా దేని కోసమో పరుగులు పెడుతూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలనే ఆరాటం వారిలో కనిపించదు.

ఈ కోవలోకే వస్తారు సమంత, నాగ చైత్యన్య. స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న సమంత ఐదేళ్ల క్రితమే అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్ళింది. 2017లో వీరి వివాహం జరుగగా ఇంత వరకు ఆమె తల్లికాలేదు. కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారసుడు నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండేళ్లుగా ఈమె గర్భవతి అని తరచూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ అక్కినేని వారి కోడలు.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసింది.

దీని వల్ల ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోలో ఆమె మునుపటి కంటే బొద్దుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఈ పిక్‌లో మామిడి కాయను కూడా హైలైట్ చేసింది. దీంతో తాను గర్భవతిని అయ్యానని ఆమె పరోక్షంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.ఆమె డ్రెస్ కూడా అలానే ఉందని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This